వైరల్ : ప్రభాస్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ పై స్టన్నింగ్ అప్డేట్స్ ఇచ్చిన దర్శకుడు..!

Prabhas

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం పలు బిగ్గెస్ట్ సినిమాలు చేస్తున్నాడు. అయితే ఆల్రెడీ కొన్ని సినిమాలు భారీ ప్లాప్ లు కూడా నమోదు అయ్యాయి. దీనితో ఈ భారీ సినిమా ల ఎఫెక్ట్ నుంచి బయటకు రావడానికి అర్జంట్ గా హిట్ కోసం అంతా వైట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలలో పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న చిత్రం “ప్రాజెక్ట్ కే”. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా అత్యంత వ్యయంలో తెరకెక్కుతుంది.

మరి ఈ సినిమాపై స్టన్నింగ్ అప్డేట్స్ ని అందించాడు. ఈ చిత్రంలో ఆల్రెడీ ప్రభాస్ పై అదిరిపోయే ఇంట్రో సీన్ తీసానని, అలాగే నెక్స్ట్ జూన్ నుంచి స్టార్ట్ చేస్తామని మన సినిమా రిలీజ్ కోసం తెలిసిందే కదా మెల్లగా అప్డేట్స్ అందిస్తానని తెలిపాడు. అలాగే చివరలో సినిమాని అయితే ప్రాణం పెట్టి తీస్తున్నామని అసలైన హై ని అందించాడు. ఇంకా ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే నటిస్తుండగా మరో హాట్ హీరోయిన్ దిశా పటాని కూడా ఈ మధ్యనే ఓకే అయ్యింది.

ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో వారితో పాటుగా బాలీవుడ్ సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తుండగా అశ్వనీదత్ మినిమం 500 కోట్ల వ్యయంతో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది చివర్లో గాని ఆ తర్వాత ఏడాదిలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ లోపు “సలార్”, “ఆది పురుష్” లు విడుదల కానున్నాయి.