గాసిప్స్ : “పుష్ప పార్ట్ 2” పై ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదా..?

Pushpa 2

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్థాయిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా నిలబెట్టిన భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప ది రైజ్ కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మికా మందన్నా నటించింది.

అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటుగా సినీ, అనసూయ తదితర నటులు ఎలాంటి నటన కనబరిచారో కూడా చూసాము. ఇంకా లాస్ట్ లో అయితే మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ చేసిన పోలీస్ పాత్ర కూడా అదిరే విలనిజాన్ని చూపింది.

మరి ఈ రోల్ కి ముందు సుకుమార్ అయితే లేటెస్ట్ విక్రమ్ లో దుమ్ము లేపిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని అనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు. కానీ మళ్ళీ ఇపుడు పుష్ప పార్ట్ 2 లో సేతుపతి మరో విలన్ లా కనిపిస్తాడని కొన్ని రోజులు నుంచి గాసిప్ లు రూమర్ లు వినిపిస్తున్నాయి.

అయితే దీనిపై ఇప్పుడు క్లారిటీ అన్నట్టు వినిపిస్తుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి అనే మాట నిజం కాదని కాస్టింగ్ పరంగా అయితే ఇంకా ఎంపిక కాలేదు అన్నట్టు తెలుస్తుంది. అలాగే ఇంకో పక్క చూసినా ఫహద్ ఎలాగో ఉన్నాడు కాబట్టి అంతకు మించిన రోల్ సెట్ చేస్తే తప్ప సేతుపతి లాంటి నటుడికి సినిమాలో స్కోప్ ఉండదు ఏది ఏమైనప్పటికీ మాత్రం ప్రస్తుతం అయితే ఈ రూమర్స్ లో నిజం లేదనే తెలుస్తుంది.