Kumari Aunty: సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతోమంది సెలబ్రిటీలుగా పాపులర్ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన కుంభమేళాలో ఒక పూసల అమ్ముకునే అమ్మాయిని ఏకంగా హీరోయిన్ ని చేసేసారు. అలాగే మన హైదరాబాద్లో కూడా రోడ్డు పక్కన ఒక ఫుడ్ స్టాల్ నడుపుకుంటూ జీవనం గడుపుతున్న కుమారి ఆంటీని ఏకంగా సెలబ్రిటీని చేసేశారు. ఈమె ప్రతిరోజు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి రోడ్డు పక్కన అందరికీ భోజనం పెడుతూ డబ్బు సంపాదించుకునేవారు.
ఇక ఈయన వద్దకు ఎంతోమంది యూట్యూబర్స్ వెళ్లి ఆమెను ఇంటర్వ్యూ చేసేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. దీంతో కుమారి ఆంటీ దగ్గర భోజనం చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు అంటే అతిశయోక్తి లేదు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫేమస్ అయిన ఈమె బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేశారు. అంతటితో ఆగకుండా కుమారి ఆంటీ ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.
కుమారి ఆంటీ ని సెలబ్రిటీ చేశారు
వంట వదిలిపెట్టి సినిమా ప్రొమోషన్స్ చేస్తుంది
అంత సోషల్ మీడియా పవర్ 😂 pic.twitter.com/NSHEQo5Sk4— ismailbhaii (@atheisttindiann) June 29, 2025
తాజాగా ఈమె షో టైం చిత్ర బృందంతో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు ఈ సినిమా జులై 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్ర బృందం కుమారి ఆంటీతో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతున్నారు. రోడ్డు పక్కన ఫుడ్ అమ్ముకుంటూ బ్రతుకుతున్న కుమారి ఆంటీని ఏకంగా సినిమా టీం తోనే ఇంటర్వ్యూ చేసే స్థాయికి తీసుకెళ్లారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కుమారి ఆంటీ క్రేజ్ వేరే లెవలే అని చెప్పాలి.