Kuberaa: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ గత నెల అనగా జూన్ 20వ తేదీన విడుదల అయిన ఈ మూవీకి పాజిటివ్ స్పందన లభించింది. అనుకున్న దానికంటే మంచి ఫలితాలు ఈ సినిమాకు లభించాయి. అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది.
థియేటర్లలో విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఊహించని విధంగా కుబేర సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. విడుదల అయ్యి నెలరోజులు కూడా కాకముందే అప్పుడే ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధమయ్యింది. కుబేర సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 50 కోట్లకు డిజిటల్ హక్కులను సొంతం చేసుకుందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. అమెజాన్ ప్రైమ్ లో జులై 18న కుబేర సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై అఫీషియల్ పైగా అనౌన్స్ చేసింది అమెజాన్ ప్రైమ్. థియేటర్లలో విడుదల అయ్యి దాదాపుగా 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి..
