ప్రధాని నరేంద్ర మోదీని ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేసిన కేటీఆర్..

ఇటీవలే ఓ టీవీ కార్యక్రమంలో భాజపా అధికారి ప్రతినిధి నుపూర్ శర్మ, భాజపా మీడియా విభాగ బాధ్యుడు నవీన్ కుమార్ జిందాల్ మహమ్మద్ ప్రవక్త పై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వారి వ్యాఖ్యలకు ఇరాన్, పాకిస్తాన్, కువైట్ వంటి పలు ముస్లిం దేశాలు నిరసనలు తెలిపాయి. అంతే కాకుండా భారతీయ ఉత్పత్తులను కూడా బహిష్కరించాలి అని నిరసనలు కూడా చేశారు.

దీంతో భాజపా వారిద్దరిని తమ పార్టీ నుంచి బహిష్కరించింది. అన్ని మతాలను తమ పార్టీ గౌరవిస్తుందని.. ఎవరు ఏం చేసినా ఊరుకునేది లేదు అని తెలిపింది. దీంతో ఈ విషయం గురించి మంత్రి కేటీఆర్ నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ.. భాజపా నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ.. భాజపా క్షమాపణ చెప్పాల్సింది తప్ప.. విద్వేషం వెదజల్లుతున్నందుకు భాజపా తొలుత ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అని ట్విట్ చేశారు.