తెలంగాణ: జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రంగంలోకి మంత్రి ‘కేటీఆర్’ దిగనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆయన ప్రచార జోరు ఈరోజు నుంచి ప్రారంభం కాబోతోంది. తొలి రోడ్‌షో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటల వరకు ప్రచార కార్యక్రమం ఉండనుంది. ఈ నెల 21న కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో కేటీఆర్ ప్రచారం ఉండనుంది. 22న మహేశ్వరం, ఎల్‌బీ నగర్ నియోజవకర్గాల్లో ప్రచారం చేస్తారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28వ తేదీన ఎల్‌బీ స్టేడియంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు.ఇక టీఆర్ఎస్ తరపున స్టార్ క్యాంపెయినర్లుగా సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మంత్రులు హరీశ్ రావు, హోం మంత్రి మహమూద్ అలీ, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రా రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ ఉండనున్నారు. వీరిని స్టార్ క్యాంపెయినర్లుగా టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది.జీహెచ్ఎంసీ ఎన్నికలు డిసెంబర్ 1వ తేదీన జరగనున్నాయి. డిసెంబర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే.