దేశంలో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా గళం వినిపించే నేతలు అతి తక్కువ మంది. మొదటిగా ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ మోడీ మీద బీజేపీ ప్రభుత్వంపై విమర్శల దాడి చేసేవాడు. ఆ తర్వాత ఏమయ్యిందో ఏమో కానీ, మునపటి మాదిరి విమర్శలు చేయటం లేదు. ఇక శివసేన అప్పుడడిప్పుడు తన వ్యతిరేకతను చూపిస్తుంది. మమతా బెనర్జీ, కేసీఆర్ లాంటి నేతలు మాత్రమే మోడీకి వ్యతిరేకంగా గళం గట్టిగా వినిపిస్తున్నారు. వాళ్లిదరు కూడా లేకపోతే పరిస్థితి మరోలా ఉంటుంది.
ఇక బీహార్ ఎన్నికల్లో కరోనా వ్యాక్సిన్ రాష్ట్రము మొత్తం ఫ్రీ గా పంపిణి చేస్తామని బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్ట్ లో పెట్టటంపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తనకైనా శైలిలో గట్టి కౌంటర్ వేసాడు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటే కేటీఆర్ తనకు ట్విట్టర్ లో ఎదురైనా ఒక ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. ‘భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ తీసుకొస్తుంది కదా! అది తెలంగాణ ప్రజలకు ఎప్పుడిస్తారు? అంటూ ఓ ఔత్సాహికుడు ట్విట్టర్లో కేటీఆర్ను ప్రశ్నించాడు. దీనికి కేటీఆర్ బదులిస్తూ ‘బ్రదర్ కరోనా వ్యాక్సిన్పై మనం ఇప్పుడు ఆశలు పెట్టుకోవద్దు.. దేశవ్యాప్తంగా అన్ని కంపెనీల వ్యాక్సిన్ డోసులు బీహార్ ప్రజల కోసం దాచిపెట్టి ఉంచారు. వాళ్లకు వేశాక మిగిలిన రాష్ట్రాల ప్రజలకు ఇస్తారు’ అంటూ బదులిచ్చారు.
ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కరోనా భయాన్ని అడ్డం పెట్టుకొని దానిని క్యాష్ చేసుకుంటూ ఎన్నికల్లో గెలవాలని చూడటం బీజేపీ యొక్క దిగజారుడు తనానికి నిదర్శనమని అనేక మంది విమర్శిస్తున్నారు. ఇక బీహార్ లో బీజేపీ గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. నిన్న మొన్నటిదాకా నితీష్ కుమార్ మీద తీవ్రమైన ఆరోపణలు చేసిన బీజేపీ, ఇప్పుడు అదే నితీష్ కుమార్ తో కలిసి ఎన్నికల బరిలో దిగుతుంది. మరి బీజేపీ ఇస్తున్న హామీలు బీహారీలు ఎంత వరకు నమ్ముతారో చేయాలి