KTR: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో ఈడీ విచారణకు హాజరైన విషయం మనకు తెలిసిందే. ఈయన ఈడీ హైదరాబాద్‌లో ఈడీ ఆఫీస్ నుండి బయటికొచ్చిన తరువాత మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తాను ఈడీ విచారణకు ఇంకా ఎన్ని సార్లు రమ్మన్నా వస్తానని తెలిపారు. ఎన్ని ప్రశ్నలు వేసిన సమాధానం చెబుతాను ఎన్ని పరీక్షలు పెట్టిన భరిస్తానని తెలిపారు.
నిజాయితీ అల్టీమేట్ గా గెలుస్తది, న్యాయం, ధర్మం గెలుస్తదని చెప్పారు. హైకోర్టులున్నాయి, సుప్రీం కోర్టులున్నాయి, న్యాయమూర్తుల మీద విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు. ఈరోజు కాకపోయినా మరో నాలుగు రోజులకైనా న్యాయమే గెలుస్తుంది ప్రజలందరికీ కూడా నిజాలు తెలుస్తాయి అంటూ ఈ కేసు విషయంలో కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు. మేము మా హయామములు ఎక్కడ తప్పు చేయలేదు తప్పు చేయము కూడా.
ఈ ఫార్ములాలో అర పైసా అవినీతి జరిగిందని నిరూపిస్తే తాను ఎలాంటి శిక్ష కైనా సిద్ధమేనని తెలిపారు. మనీలాండరింగ్ ఎక్కడ జరిగిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత 8 గంటలపాటు జరిగిన విచారణలో ఈడీ అధికారులకు ఇదే విషయం చెప్పాను. తప్పు చేసి ఉంటే రుజువు చేయండని అధికారులను కూడా తాను అడిగానని తెలిపారు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టిన ఎన్నిసార్లు విచారణకు పిలిచినా తాను భయపడేది ఏమాత్రం లేదు అంటూ కేటీఆర్ మాట్లాడారు.
ఇక ఈ సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఈయన పలు వ్యాఖ్యలు చేశారు .సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను అందించే ఆఫర్ ఇదే అంటూ ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో 2015 లో ఏసీబీ మీపై కేసు నమోదు చేసింది. అదే కేసులో ఈడీ కూడా కేసు నమోదు చేసి చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ కేసులో ఇప్పటికీ మీరు విచారణ ఎదుర్కుంటున్నారు.
ఈ కేసులో మీరు విచారణ ఎదుర్కొంటున్నారన్న ఉద్దేశంతో నాపై కూడా కేసు పెట్టారని కేటీఆర్ ఆరోపణలు చేశారు. అయినాసరే ఈ కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. కానీ మీకు నేనిచ్చే ఆఫర్ ఏంటంటే… మీరు ఒక తేదీ, వేదిక ఖరారు చేస్తే ఇద్దరం కలిసి లై డిటెక్టర్ టెస్టులో పాల్గొందాం నిజా నిజాలు ఏంటి ఎవరు నిజం చెబుతున్నారనే విషయాలు తెలుస్తాయి అంటూ కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మరి ఈ వ్యాఖ్యలపై రేవంత్ రియాక్షన్ ఏంటో తెలియాల్సి ఉంది.