KTR: సాధారణంగా ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి వలసలు రావడం సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఏకంగా పదిమంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం మనకు తెలిసిందే అయితే ఇలా పార్టీ పిఠాయించిన వారి గురించి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు ప్రస్తుతం సంచలనగా మారింది.
ఎవరైతే బిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఆ పదిమంది ఎమ్మెల్యేల చేత రేవంత్ రెడ్డి రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలి అంటూ సవాల్ విసిరారు.కాగా నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల కేసు విచారణకు రాగా.. ఇంకా ఎంతకాలం ఆయా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా ఉంటారని ఉన్నత న్యాయస్థానం స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ విషయం గురించి లోక్ సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీకి కేటీఆర్ ట్వీట్ చేస్తూ సవాల్ విసిరారు.కాంగ్రెస్ నేతల హిపోక్రసీ మరోసారి బయట పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఒకవైపు రాహుల్ గాంధీ.. పార్టీ మారిన నేతలను అనర్హులుగా ప్రకటించేలా రాజ్యాంగ సవరణ చేస్తామని ప్రచారం చేస్తారని, మరోవైపు రేవంత్ మాత్రం ఇతర పార్టీ నేతలకు తలుపులు తెరుస్తారు అంటూ ఎద్దేవా చేశారు.
మీ పార్టీపై మీకు నమ్మకం ఉండి మంచి చేశామనిపిస్తే వెంటనే పార్టి మారిన ఈ పదిమంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు రావాలి అంటూ సవాల్ విసిరారు. మీకు దమ్ము ఉంటే ఆ పదిమందిపై అనర్హత వేటు వేయండి అంటూ కేటీఆర్ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.