గత కొద్దీ రోజులుగా వైసీపీ నేతలు చంద్రబాబు మీద ఆరోపణలు చేయటం తగ్గించారనే చెప్పాలి. కారణాలు ఏమైనా కావచ్చు కానీ, గతంలో కంటే ఇప్పుడు చంద్రబాబు మీద మాటల దాడి తగ్గింది. ఇదే సమయంలో బాబు కూడా సైలెంట్ అయ్యిపోయి, కేవలం పార్టీ పరంగా దృష్టి పెట్టాడు, అయితే చంద్రబాబు మరోసారి వైసీపీ పార్టీని, జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయటంతో వైసీపీ నేతలు కూడా బాబును టార్గెట్ చేస్తూ విమర్శల బాణాలు సంధిస్తున్నారు.
గతంలో టీడీపీ అమలు చేసిన పథకాలను వైసీపీ తొక్కి వేస్తుందని ఆయన అన్నారు.. ఇప్పటి వరకు జగన్ ప్రజలకు చేసిన మేలు ఏంటో చూపించాలని ఇటీవల బాబు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఆ వ్యాఖ్యలు కాస్త రాజకీయ చర్చలకు దారితీసింది. ఈ విషయం కాస్త హాట్ టాపిక్ అవ్వడంతో ఒకరి పై మరోకరు మాటల యుద్దానికి దిగారు. తాజగా ఈ విషయం పై స్పందించిన వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని.. బాబు పై తీవ్ర విమర్శలు చేశారు..
ఇల్లు కట్టించలేదు అని అనడం భావ్యం కాదు. నోటికి వచ్చినట్లు బాబు మాట్లాడితే ఇక్కడ చేతులకు గాజులు తొడుక్కుని ఎవరూ కూర్చొని లేరు.. ప్రజల సంక్షేమం కోసం జగన్ అహర్నిశలు పాటు పడుతున్నారు.. అందుకే జగన్ పాలనను ప్రజలు నిర్విరామంగా కొనసాగాలని కోరుతున్నారని కొడాలి అన్నారు. అంతేకాదు చంద్రబాబు 12 వందలకు పైగా ఇల్లు కట్టించాడని అన్నాడు.. వాటి పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి..చంద్రబాబు ఒక నీచుడు, దుర్మార్గుడు.. ఇల్లు కట్టిస్తున్నా అని ప్రజలను మోసం చేశాడు అంటూ.. నాని అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు.. మామూలుగానే మంత్రి కొడాలి నాని మాట్లాడితే కట్టే విరిచి పొయ్యిలో పెట్టినట్లు ఉంటుంది, ఇక తాజాగా కొడాలి నాని వ్యాఖ్యలు టీడీపీ నేతలకు మంట పుట్టించటం ఖాయం.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలందరూ గతంలో టీడీపీ కట్టించిన ఇల్లు విషయం మీద పోరాటాలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఇల్లు చాలా వరకు నిర్మాణం పూర్తి చేసుకున్నాయని, చివరిదశ పనులు మాత్రమే మిగిలివున్నాయని,వాటిని పూర్తిచేస్తే పేద ప్రజలకు ఇళ్లను అందించే అవకాశం ఉన్నకాని వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపించటం లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ విధంగా ఇరు పార్టీల మధ్య ఇళ్ల రగడ తారాస్థాయికి చేరుకుంది.