Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్ ఆగస్టు 15న మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల సంచలనంగా మారాయి. ఆగస్టు 15వ తేదీ సూపర్ సిక్స్ హామీలలో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఈయన మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మహిళలు ఆవకాయ పెట్టడం నుంచి మొదలుకొని అంతరిక్షంలోకి వెళ్లే వరకు వెనకాడటం లేదని దేశ అభివృద్ధికి మహిళల కృషి ఎంతో అవసరమని తెలిపారు.అద్భుతాలన్నీ మహిళలతోనే సాధ్యమవుతాయి. స్త్రీ శక్తి పథకం మహిళలకు మరింత శక్తిని ఇస్తుంది. 5 వేల కోట్ల విలువైన కంపెనీని నా తల్లి నడుపుతున్నారని అన్నారని చెప్పారు.
గత ప్రభుత్వం మహిళల శక్తికి అడ్డుకట్టు వేసిందని శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారని గుర్తు చేసుకున్నారు. అందుకే ప్రజలు సరైన బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చో పెట్టారని లోకేష్ ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మన ప్రభుత్వ హయామంలో మహిళలకు అన్యాయం జరిగితే సహించేది లేదని తెలిపారు. అంతేకాకుండా మహిళలను కించపరుస్తున్నట్టు సినిమాలు కానీ వెబ్ సిరీస్ లు కానీ వచ్చిన తప్పకుండా వాటి విడుదలను అడ్డుకుంటామని, ఇలాంటి సినిమాలు రాకుండా ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని లోకేష్ తెలియజేశారు.
గత ప్రభుత్వ హయాంలో మద్యపానం నిషేధం చేస్తానని ఒక రాక్షసుడు చెప్పారు. కానీ మద్యం పేరుతో విషం అమ్మి ఎంతోమంది మహిళల తాళిబొట్లను తెంచారని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి పాలనపై విమర్శలు కురిపించారు. సొంత చెల్లితో కూడా రాఖీ కట్టించుకోలేని వాళ్లు కూడా మహిళల గురించి వారి గౌరవం గురించి మాట్లాడుతున్నారని మహిళల గురించి తప్పుగా మాట్లాడితే తోలు తీస్తాను అంటూ ఈ సందర్భంగా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
