Turmeric: ఈ సమస్యతో బాధపడే వారు పసుపు దూరం పెట్టాల్సిందే… ఎవరంటే?

Turmeric: మన నిత్యజీవితంలో పసుపు ఎంతో ప్రాధాన్యత మన వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలలో పసుపు కీలక పాత్ర పోషిస్తుందిమన వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పవచ్చు.మన ప్రతి వంటకంలో పసుపు ఉండాల్సిందే. పసుపు వల్ల కేవలం ఆహారం రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. చాలామంది ప్రతిరోజూ పసుపు కలిపిన పాలను తాగుతుంటారు. దీని వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పసుపులోని కర్కుమిన్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. పసుపుని ప్రతి రోజు తీసుకోవడం వలన జలుబు దగ్గు ముక్కు దిబ్బడ వంటివి రాకుండా చూసుకోవచ్చు.

మనదేశంలో పసుపుని ఆయుర్వేదంలో కొన్ని రకాల చికిత్సలు కూడా వినియోగిస్తారు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే డైటరీ ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, మ్యాంగనీస్, విటమిన్ బి6, జింక్, సోడియం ఉన్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పసుపుని రోజు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పసుపు తీసుకోవడం వలన మాత్రం అనేక సమస్యలకు దారితీస్తుంది అని నిపుణుల అభిప్రాయం. ఎందుకో చూద్దాం…..

ప్రతి రోజు పసుపు కలిపిన పాలను తీసుకోవడం వలన శరీరం ఐరన్ గ్రహించే శక్తిని కోల్పోతుంది దీంతో రక్తహీనతకు దారితీస్తుంది, అందువలన రక్తహీనత ఉన్న వాళ్ళు పసుపు కలిపిన పాలను రోజు కాకుండా వారంలో రెండు మూడు సార్లు తీసుకోవడం మంచిది.కిడ్నీలో రాళ్లు ఇతర భాగాల్లో రాళ్లు ఉన్న వారు పసుపుని అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతుంది, అటువంటి వారు డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. ఇక మధుమేహ వ్యాధిగ్రస్తులు అతిగా పసుపు తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.

పసుపుని అధికంగా తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కామెర్ల సమస్యతో బాధపడే వాళ్ళు డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. పసుపు రక్తస్రావం సమస్యను రెట్టింపు చేస్తుంది ఎందుకంటే పసుపు రక్తం గడ్డ కట్టే చర్యను నెమ్మది చేస్తుంది.ముక్కు ఇతర శరీర భాగాల నుంచి రక్తస్రావం అయ్యే వాళ్ళు పసుపుని తక్కువగా తీసుకోవటం మంచిది. అందువలన సాధారణ వ్యక్తులు పసుపుని రోజుకి ఒకటి నుంచి మూడు స్పూన్ల వరకు తీసుకోవచ్చు. పైన చెప్పిన సమస్యలతో బాధపడే వారు మాత్రం డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. ఆరోగ్యానికి మంచిది కదా అని ఓవర్ గా మాత్రం తీసుకోకూడదు.