చిటికెడు పసుపుతో ఏకంగా ఇన్ని లాభాలు ఉన్నాయా.. పసుపుతో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చా?

పసుపు ఆరోగ్యానికి చాలా మంచిదని పసుపు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పురాతన కాలం నుంచి వైద్య విధానంలో పసుపును ఎక్కువగా వినియోగిస్తున్నారు. పసుపును వంటకాలలో ఎక్కువగా వాడటం వల్ల బరువు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఫేస్ ప్యాక్స్ లో కూడా పసుపును ఎక్కువగా ఉపయోగిస్తాం.

ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయడంలో పసుపు ఎంతగానో తోడ్పడుతుంది. అయితే పసుపును పరిమితంగా తీసుకోవడం ద్వారా మాత్రమే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పసుపును ఎక్కువగా వాడితే మాత్రం కొన్ని నష్టాలు తప్పవని చెప్పవచ్చు. పసుపును పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు. ఒక వ్యక్తి రోజుకు 500 మిల్లీగ్రాముల పసుపు తీసుకుంటే మంచిది.

పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపునొప్పి, విరోచనాలు, ఉబ్బరం, తలతిరగడం, తలనొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. పసుపు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పిత్తాశయ సమస్యలు, రక్తస్రావం, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధ పడేవాళ్లు పసుపును పరిమితంగా తీసుకుంటే మంచిది.

మధుమేహం సమస్యతో బాధ పడేవాళ్లు సైతం పసుపు వినియోగం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. పసుపులో ఉండే కర్కుమిన్ షుగర్ లెవెల్స్ ను తగ్గించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఐరన్ లోపంతో బాధ పడేవాళ్లు పసుపు తీసుకుంటే కొత్త ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ పసుపును వాడేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.