నోటి దుర్వాసన సమస్య మిమ్మల్ని వేధిస్తోందా? కారణాలు ఇవే కావచ్చు జాగ్రత్త?

నోటి నుంచి వచ్చే దుర్వాసనను తొలగించుకోవడంలో అశ్రద్ధ వహిస్తే భవిష్యత్తులో ప్రమాదకర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు నోటిని,దంతాలను శుభ్రం చేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే కొంతకాలానికి దంత క్షయం, చిగుళ్ల సమస్యలు ప్రారంభమై నోటి నుంచి దుర్వాసన వెలబడే అవకాశం ఉంటుంది.అలా కాకుండా మరి కొందరిలో డయాబెటిస్, జీర్ణ కోశ వ్యాధులు, శ్వాస కోశ వ్యాధులు ఉన్నవారిలో కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశాలు ఎక్కువ కనుక నోటి దుర్వాసన విషయంలో అశ్రద్ధ వహించడం మంచిది కాదు.

నోటి దుర్వాసనను పోగొట్టి తాజా శ్వాసను పొందాలంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను తప్పనిసరిగా పాటించాల్సిందే. ప్రతిరోజు ఉదయం రాత్రి పడుకునే ముందు కచ్చితంగా బ్రష్ చేసుకోవడం మర్చిపోవద్దు.చిగుళ్ల ఇన్ఫెక్షన్ తో బాధపడేవారు యాంటీ మైక్రోబియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్న పసుపు, ఉప్పు మిశ్రమం కలిపిన నీళ్లతో నోటిని శుభ్రం చేసుకోవాలి.నోరు, గొంతు, నాలుక పొడి బారిన నోటి దుర్వాసన వస్తుంది కనుక ప్రతి రెండు గంటలకు ఒకసారి తప్పనిసరిగా గ్లాసు మంచినీళ్లు తాగడం మంచిది.

రోజువారి ఆహారంలో విటమిన్ సి సమృద్ధిగా కలిగిన పండ్లు, కూరగాయలను ఆహారంగా తింటే మనలో ఇమ్యూనిటీ శక్తి పెంపొంది అన్ని రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.భోజనం చేసిన తర్వాత చిటికెడు సోంపు తింటే నోటి దుర్వాసన తగ్గుతుంది
మిరియాల పొడి, పసుపు, ఉప్పు, నువ్వుల నూనె మిశ్రమాన్ని మెత్తని పేస్టులా చేసి ప్రతిరోజు పళ్లు తోమితే చిగుళ్ల సమస్యలు తొలగి నోటి దుర్వాసన తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.అత్యవసర సమయాల్లో నోటి దుర్వాసన పోగొట్టే మెంథాల్ ఔషధ గుణాలు కలిగిన మౌత్ వాష్, చూయింగ్ గమ్ వాడవచ్చు. అలాగే పొగ తాగడం, ఆల్కహాల్ సేవించడం, పొగాకు నమలడం వంటి చెడు అలవాట్లు ఉంటే తక్షణమే మానుకోవాలి.