ప్రతిరోజు చిటికెడు పసుపు తీసుకుంటే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు..ఎలాగంటే?

turmeric-root-and-powder

ప్రతిరోజు మన ఆహారంలో రుచి కోసం ఉపయోగించే పసుపులో ఎన్నో ఔషధ గుణాలతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు,యాంటీమైక్రోబియల్ గుణాలు యాంటీ ఫంగల్,యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉన్నందున ప్రతిరోజు ఉదయాన్నే పాలల్లో చిటికెడు పసుపు కలుపుకొని సేవిస్తే మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొంది సీజనల్గా అనారోగ్యానికి కారణం అయ్యే అలర్జీలు, ఇన్ఫెక్షన్లను నియంత్రించడంలో తోడ్పడుతుంది.

ముఖ్యంగా జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి వంటి ఫ్లూ లక్షణాలతో బాధపడేవారు చిటికెడు పసుపు పొడిని గోరువెచ్చని పాలల్లో వేసుకొని ఉదయం, సాయంత్రం సేవిస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది.పసుపులోని సహజ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని విష పదార్థాలను తొలగించి క్యాన్సర్, అల్జీమర్ వ్యాధి, హై బీపీ, లివర్ సిండ్రోమ్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. అలాగే రక్తంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి గ్లూకోస్ స్థాయిలను నియంత్రిస్తుంది తద్వారా డయాబెటిస్ వ్యాధినీ అదుపులో ఉంచుకోవచ్చు.

అధిక కొలెస్ట్రాల్ సమస్య వల్ల తలెత్తే ఊబకాయం, రక్తపోటు సమస్యలను తగ్గించడంలో పసుపు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. పసుపులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు తరచూ శ్వాస ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే వైరస్ ,బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను అదుపు చేసి బ్రాంకైటిస్, న్యుమోనియా, సైనస్, ఆస్మా వంటి వ్యాధుల తీవ్రతను తగ్గిస్తుంది. తరచూ చర్మ ఇన్ఫెక్షన్లు, అలర్జీలతో బాధపడేవారు పసుపు మిశ్రమాన్ని చర్మం పై లేపనంగా ఉపయోగిస్తే సహజ చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు.