కెజిఎఫ్-2’కు మోక్షం లేనట్టుంది..ఈసారి ఎన్నాళ్ళో

KGF 2 release date may be changed
KGF 2 release date may be changed
 
ఒక దక్షిణాది ప్రేక్షకులే కాదు.. యావత్ భారతీయ సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘కెజిఎఫ్-2’.  యాష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి.  ఈపాటికే విడుదలకావాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. బ్యాలెన్స్ ఉండిపోయిన షూటింగ్ ఇటీవలే కంప్లీట్ చేశారు టీమ్.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.  జూలై 16న చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు.  ఆ మేరకు హక్కుల్ని కూడ భారీ ధరలకు విక్రయించారు. విడుదలకు ఇంకో 2 నెలల సమయం మాత్రమే ఉంది.  ఇలాంటి టైంలో చిత్రం మరోసారి వాయిదాపడే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. 
 
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేని పరిస్థితి.  రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయే తగ్గే సూచనలు కనిపించట్లేదు.  ప్రభుత్వం పాక్షిక ఆంక్షలు విధించాలని అనుకున్నా కూడ ముందుగా మూసేవేసేది సినిమా థియేటర్లనే.  ఇంకో రెండు మూడు వారాల్లో గనుక సిట్యుయేషన్ కంట్రోల్ కాకపోతే థియేటర్లు క్లోజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.  అలాకాకపోయినా 50 శాతం ఆక్యుపెన్సీ కండిషన్ పెట్టవచ్చు.  వీటిలో ఏది జరిగినా ‘కెజిఎఫ్-2’కు ఇబ్బందులు తప్పవు.  అందుకే నిర్మాతలు ఈ గందరగోళం తగ్గేవరకు సినిమాను ఆపాలని అనుకుంటున్నారట.  ఒకవేళ అదే గనుక జరిగితే సినిమా ఇంకెన్ని రోజులు వెనక్కు వెళ్తుందో మరి.