హోంబలే ఫిల్మ్స్ భారతీయ సినీ పరిశ్రమలో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటిగా ఎదిగింది. ఈ సంస్థ ఇప్పటికే చాలా సూపర్ హిట్ చిత్రాలతో న్యూ హైట్స్ ని క్రియేట్ చేసింది. అలాంటి హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి పని చేయబోతోందని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇది హృతిక్ రోషన్ అభిమానులకూ, సినిమాప్రేమికులకూ నిజంగా ఓ బిగ్ న్యూస్!
హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ, “ఈ కాంబినేషన్ పై నాకు చాలా ఆనందంగా ఉంది. హోంబలే ఫిల్మ్స్‌లో మేము స్ఫూర్తిదాయకమైన కథలను చెప్పాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. హృతిక్ రోషన్‌తో ఓ గొప్ప సినిమా ఎక్స్ పీరియన్స్ ని అందించాలన్న లక్ష్యాన్ని సాకారం చేస్తాం. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయేలా వుంటుంది” అని చెప్పారు.
హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. “హోంబలే ఫిల్మ్స్ అనేక వైవిధ్యమైన కథలతో ముందుకొచ్చిన సంస్థ. వారితో కలిసి పనిచేయబోతున్నందుకు నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. మేము పెద్దగా కలలు కంటున్నాం. ఆ కలల్ని నిజం చేసేందుకు పూర్తిగా అంకితభావం ఉన్నాం” అన్నారు.
హోంబలే ఫిల్మ్స్ ‘కేజీఎఫ్ చాప్టర్ 1 & 2’, ‘సలార్: పార్ట్ 1 – సీస్‌ఫైర్’, ‘కాంతార’ వంటి పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఇండియన్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటిగా నిలిచింది. బాక్స్ ఆఫీస్ విజయాల్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పింది.
హృతిక్ రోషన్ దేశవ్యాప్తంగా మ్యాసీస్ ఫ్యాన్స్ వున్న హీరోల్లో ఒకరు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, మాగ్నటిక్ పెర్ఫార్మెన్స్.. అన్నీ కలసి ఎన్నో బ్లాక్‌బస్టర్‌లను అందించాయి. ఆయన రాబోయే సినిమాలు అయిన ‘వార్ 2’, ‘కృష్ణ 4’ కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి.
ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్, హృతిక్ రోషన్ కాంబినేషన్ తో ప్రేక్షకుల్లో ఎక్సయిట్మెంట్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది.