Kethi Reddy: రష్మిక వల్లే సంధ్యా థియేటర్ ఘటన… పవన్ బాలయ్య రాజకీయాలకు వేస్ట్: కేతిరెడ్డి

Kethi Reddy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అరెస్టయి వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా అల్లు అర్జున్ అరెస్టు కావడం గురించి ఎంతోమంది రాజకీయ నాయకులకు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చూపించారు అయితే తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైకాపా నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కేతిరెడ్డి పలు విషయాల గురించి ప్రస్తావన చేశారు. ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటనలో భాగంగా అల్లు అర్జున్ అరెస్టు కావడం గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఈయన మాట్లాడుతూ అసలు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కు ఏ మాత్రం సంబంధం లేదని, రష్మిక వల్లే ఈ ఘటన జరిగిందని ఈయన బాంబు పేల్చారు. అల్లు అర్జున్ ఈ సినిమాలో చూడటానికి పెద్దగా ఏం బాగుండడు కానీ రష్మికను చూడటం కోసమే పెద్ద ఎత్తున జనాలు అక్కడికి వచ్చారని ఈయన తెలిపారు.

ఇలా రష్మిక చూడటం కోసం వచ్చి తొక్కిసలాటలో భాగంగా రేవతి అనే అభిమాని చనిపోవడం దురదృష్టకరమని తెలిపారు అయితే ఈ ఘటనలో అల్లు అర్జున్ ని బాధ్యున్ని చేశారని తెలిపారు. ఇకపోతే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ల గురించి కూడా ఈయన మాట్లాడారు సినిమా ఇండస్ట్రీలో వీరు మంచి నటులే అయినప్పటికీ రాజకీయాలకు వేస్ట్ అని తెలిపారు.

పవన్ కళ్యాణ్ పోటీ చేయగా చేయగా పొత్తు పెట్టుకుని గెలిచారు. అలాగే బాలకృష్ణ మూడుసార్లు హిందూపురం నియోజకవర్గం నుంచి గెలిచారు హిందూపురం కాబట్టే గెలిచారు అదే ఒక్కసారి హిందూపురం కాకుండా ఎక్కడైనా పోటీ చేసి గెలవమనండి చూద్దాం అంటూ కేతిరెడ్డి మాట్లాడారు. ఇక పవన్ కళ్యాణ్ నటన పరంగా కూడా పెద్ద గొప్ప నటుడేం కాదని కమల్ హాసన్ కంటే కూడా ఈయన గొప్ప నటుడు కాదంటూ కేతిరెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.