Kethi Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు సంచలనంగానే ఉంటాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు నిత్యం ఆందోళనకరంగానే ఉంటాయి అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడమే కాకుండా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా జెసి ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో తాడిపత్రిలో జెసి హవా కొనసాగుతుంది. ఇకపోతే కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వచ్చేకి వీలు లేదు అంటూ ఆంక్షలు విధించారు కోర్టు అనుమతి ఉన్న ఆయన తాడిపత్రిలోకి అడుగుపెట్టలేకపోతున్నారు.
ఇలా తన సొంత ఇంటికి వెళ్లడానికి కూడా అడ్డంకులు ఎదురవుతున్న నేపథ్యంలో కేతిరెడ్డి తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెసి ప్రభాకర్ రెడ్డి కుటుంబం పై తాము తప్పుడు కేసులు పెట్టామంటూ మాట్లాడటం సరైనది కాదని తెలిపారు మేము ఆయనపై ఏమేమి కేసులు పెట్టామో అవన్నీటికి కూడా పక్క ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
ఇకపోతే గత ప్రభుత్వ హయాంలో తాను జేసీ ఇంటికి వెళ్లి జేసి కుటుంబ సభ్యులను తప్పుగా మాట్లాడాను అంటూ ప్రభాకర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్లి దుర్భాషలాడినట్లు జేసీ భార్య ఉమక్క కనక చెబితే తాను బహిరంగంగా జేసి కుటుంబానికి క్షమాపణలు చెబుతాను అంటూ ఈ సందర్భంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంపై జేసీ స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అయితే జెసి ట్రావెల్స్ కి సంబంధించి గతంలో వీరిపై పలు కేసులో నమోదైన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల కేతిరెడ్డి కోడలను జెసి అడ్డుకోవడం పోలీసులపై దుర్భాషలాడుతూ మాట్లాడటానికి కూడా కేతిరెడ్డి ఖండించారు.
