Kethi Reddy: రాజకీయాలలో ఏది అనుకోకుండా జరగదు…. సంచలనంగా మారిన కేతిరెడ్డి పోస్ట్!

Kethi Reddy: విజయ్ సాయి రెడ్డి రాజీనామ చేయటం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఉన్నఫలంగా వైసీపీ పార్టీలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకొని ఉన్నటువంటి విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరం కావడానికి గల కారణం ఏంటి అంటూ చర్చలు జరుపుతున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా పై ఎంతోమంది వారి అభిప్రాయాలను కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటికే పలువురు వైకాపా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా విజయసాయిరెడ్డి రాజీనామా పై స్పందించారు.

ఇక వైయస్ షర్మిల కూడా ఘాటుగా స్పందించారు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్న సమయంలో రాజకీయాలకు రాజీనామా చేశారు అంటే అది చిన్న విషయం కాదని తెలిపారు. ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి విజయ సాయి రెడ్డిని బిజెపికి దగ్గరగా ఉంచి తన కేసుల విచారణ జరగకుండా అడ్డుకున్నారు. ఇక ప్రస్తుతం ఈయన రాజకీయాలకే రాజీనామా చేశారు అంటే దీని వెనుక ఏదో వ్యూహం ఉందని కూడా తెలిపారు.

ఇక చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయం గురించి స్పందిస్తూ ఎవరి అంతర్గత విషయాలు వారికి ఉంటాయని, నాయకుడు నచ్చితే పార్టీలో కొనసాగుతారు నాయకుడి పై నమ్మకం లేకుంటే బయటకు వస్తారు అంటూ కూడా విజయ్ సాయి రెడ్డి రాజీనామా పై స్పందించారు. అయితే తాజాగా వైకాపా నాయకుడు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… రాజకీయాలలో ఏది కూడా అనుకోకుండా జరగదు ఒకవేళ జరిగితే, అది ఆ విధంగా ప్లాన్ చేయబడిందని మీరు పందేం కూడా వేయవచ్చు అంటూ ఫ్రాంక్లిన్ డీ. రూజ్ వెల్ట్ కొటేషన్ ను పోస్ట్ చేశారు కేతిరెడ్డి. ఇలా కేతిరెడ్డి షేర్ చేసిన ఈ పోస్ట్ కచ్చితంగా విజయసాయిరెడ్డి రాజీనామాకు సరిపోతుందని ఈయన తన రాజీనామాన్ని ఉద్దేశించే ఇలాంటి పోస్ట్ చేశారని అందరూ భావిస్తున్నారు.

రాజకీయాలలో ఏది కూడా అనుకోకుండా జరగదు అంటూ ఈయన పోస్ట్ చేయడంతో కచ్చితంగా విజయసాయిరెడ్డి రాజీనామా అనుకొని జరిగినదేనని, ఈ రాజీనామా వెనుక పెద్ద వ్యూహం ఉందని అందరూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పోస్ట్ పై కేతిరెడ్డి మరేదైనా వివరణ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.