JC Prabhakar Reddy: కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అక్కడ ఎమ్మెల్యేగా జెసి ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి విజయం సాధించారు. అలాగే ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల నాటి నుంచి తాడిపత్రిలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగు పెట్టకూడదు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి భీష్మించుకొని కూర్చున్నారు. కోర్టు అనుమతితో పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేసిన పోలీసులు వెంటనే తనని అరెస్టు చేస్తే అక్కడి నుంచి పంపించేస్తున్నారు.
ఇలా పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వను అంటూ జేసీ పలు సందర్భాలలో తెలియజేశారు. తాజాగా కేతిరెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డికి కూడా ఈయన తనదైన శైలిలోనే సూచనలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రానిచ్చే సమస్యే లేదని తెలిపారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకోవద్దు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నేడు జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ ఇంటి పట్ల జరిగిన దాడి గురించి మాట్లాడుతున్నారు బానే ఉంది కానీ గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి అక్క అయిన నా భార్యపై జరిగిన దాడి గురించి ఎందుకు మాట్లాడలేదు అంటూ ప్రశ్నించారు.
ప్రసన్న కుమార్ రెడ్డి అక్క (జెసి ప్రభాకర్ రెడ్డి భార్య) ఉమా రెడ్డి పై పన్నెండు కేసులు నమోదు అయ్యాయి.అన్నెం పున్నెం ఎరుగని ఆమె కోడలిపై 3 కేసులు పెట్టారు. నన్ను నా కొడుకుని కూడా జైలుకు పంపించారు. మీ ప్రభుత్వ హయామంలో పెద్దారెడ్డి నా ఇంటికి వచ్చి దుర్భాషలాడితే అప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నావు అంటూ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఒకప్పుడు మమ్మల్ని ఇంత ఇబ్బందులకు గురిచేసిన పెద్దారెడ్డిని ఇప్పుడు తాడిపత్రిలోకి వస్తానంటే ఎలా రానిస్తాను అంటూ జేసి ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనగా మారాయి.
