Kethi Reddy: స్కూల్లో కాలేజీలు ఎలాగో డెవలప్ చేయరు… జైళ్ళను డెవలప్ చేయండి.. కేతిరెడ్డి షాకింగ్ కామెంట్స్!

Kethi Reddy: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.నెల్లూరు జైలులో ఉన్న తమ సహచరుడు మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. ఈయనతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి తదితరులు కూడా ఉన్నారు. ఇలా జైలులో గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలను తీసుకెళ్లి జైల్లో పెట్టే ఒక తప్పుడు సాంప్రదాయానికి కూటమి ప్రభుత్వం తెరతీసిందని కేతిరెడ్డి తెలిపారు.ఈరోజు జైల్లోకి వెళ్ళిచూసినప్పుడు లోపల సౌకర్యాలు అసలు బాగోలేవనీ, మరో నాలుగేళ్ల పాటు మాకు అరెస్టులు తప్పు మేము ఎలాగో జైలుకు వెళ్లాల్సిందే. ప్రతి ఒక్కరిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. అయితే ఈ నాలుగేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది మేమేనని అప్పుడు మీరు కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కేతిరెడ్డి తెలిపారు.

ఇక నాలుగేళ్ల తర్వాత మీరు కూడా జైలుకు వెళ్లాలి కనుక ఇప్పుడే జైళ్లను అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసుకోండి. మీ ప్రభుత్వంలో ఎలాగో హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీలు డెవలప్ చేయరు కనీసం జైలు అయినా అన్ని సౌకర్యాలతో డెవలప్ చేసుకోండి మాకు మీకు కూడా చాలా మంచిదే అంటూ కేతిరెడ్డి చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇలా ఈయన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే నువ్వు కూడా జైలుకు వెళ్లాల్సిందేనని ఫిక్స్ అయిపోయావా అన్న అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరి కొందరు ఇలాంటి ఒక చెడు సాంప్రదాయాన్ని తీసుకువచ్చిందే మీరు అంటూ కూటమి కార్యకర్తలు కామెంట్లు చేస్తున్నారు..