విశాఖ ఎల్ జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజ్ కారణంగా మృతి చెందిన బాధిత కుటుంబాలకి ఒక్కొకరికి చోప్పున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోటి రూపాయాలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా సదరు కంపెనీ నుంచి బాధిత కుటుంబాలకు రావాల్సిందంతా మొత్తం రాబడుతానని హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 10 లక్షలు… కంపెనీ పరిసరాల్లో ఉన్న ఒక్కో కుటుంబానికి 25 వేలు ప్రకటించారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. సంఘటన జరిగినవెంటనే ముఖ్యమంత్రి ఘటనా స్థిలికి చేరుకుని స్వయంగా బాధితుల్ని ఆ కుటుంబాల్ని పరామర్శించారు.
భవిష్యత్ గురించి ఎలాంటి చింతన వద్దని..అన్ని రకాలుగా బాధిత కుటుంబాలకు సహాయ అందిస్తామని మాటిచ్చారు. అయితే ఇప్పటివరకూ రాష్ర్టంలో ఏ ముఖ్యమంత్రి ఇలా మృతుల కుటుంబాలకు కోటి రూపాయాల ప్రకటన ఎక్కడా జరగలేదు. దీంతో టీడీపీ నేతలు దీనిపై చిల్లర రాజకీయాలు మొదలుపెట్టారు. ఎప్పుడూ టీడీపీ కి బాకా కొట్టే పచ్చ మీడియా ఈసారి ఈఘటన విషయంలో అంతగా రియాక్ట్ కాలేదు. అధికారులు చెప్పింది చెప్పినట్లు రాసి తమవీ విలువలున్న పత్రికలని నిరూపించు కున్నాయి. అయితే గేదె చేనులో మేస్తూ…దూడ గట్టున మేస్తుందా? అన్న చందంగా ఇప్పటికే టీడీపీ విపక్ష నేత చంద్రబాబు రాజకీయాలు మొదలు పెట్టేసారు. ఆ వేంటనే టీడీపీ ఎంపీ కేశినేని రంగంలోకి దిగిపోయారు.
గోదావరి బోటు ప్రమాదంలో మృతి చెందిన వారికి కూడా జగన్ కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇచ్చి ఉంటే బాగుండేది. ఇప్పటికీ మించి పోయింది లేదు ఆ కుటుంబాలకు బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వాలని వ్యాఖ్యానించారు. దీంతో కేశినేని వ్యతిరేక వర్గం విమర్శలకు దిగింది. కేశినేని చిల్లర వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ ఎద్దేవా చేసారు. బోటు ఘటనకి..గ్యాస్ ఘటనకి తేడా తెలియని నాయకులు రాజకీయాలు చేస్తున్నారంటూ! మండిపడ్డారు. జగన్ కోటి రూపాయాల ఎక్స్ గ్రేషియా ప్రకటన వెనుక బాధితుల భవిష్యత్ ఉంది. భవిష్యత్ లో తలెత్తే దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలు ప్రతీ సారి ప్రభుత్వం మీద ఆధారపడకుండా..ఆఫీసులు చుట్టూ తిరగకుండా ముందు జాగ్రత్త చర్యగా తీసుకున్నారన్న కనీస జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారని వైకాపా శ్రేణులు తిప్పికొట్టారు.