కేశినేని నాని వర్సెస్ విజయవాడ టీడీపీ.. అసలు కథ ఇదే.. !

kesineni nani

 విజయవాడ టీడీపీలో విభేదాలు మరోసారి బయట పడ్డాయి. టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ కేశినేని నానికి, విజయవాడ లోకల్ టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పుల ఉంటున్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.

kesineni nani

 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ గా తన కూతురును దించాలని ఎంపీ కేశినేని నాని భావిస్తున్నాడు. ఆ పదవి మీద కన్నేసిన కొందరు నేతలు ఆ ప్రయత్నాలను అడ్డుకునే విధంగా పావులు కదుపుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఎవరిని ఉంచినా చెమటలు చిందించి గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తామని చెబుతున్న ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ నేత నాగుల్ మీరా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ కేశినేని వ్యతిరేక కూటమిగా ఏర్పడ్డారు.

 తాజాగా ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు క్యారెక్టర్, క్యాలిబర్ ఉన్న నాయకులంటే ఇష్టమని, ఎవరైనా తన వెనుక రావాల్సిందే గాని.. తాను ఎవరి వెనుక వెళ్లనని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన సామంతులు పార్టీకీ నష్టం కలిగించేలా ప్రచారం చేస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియదా అని అంటూ వారిని గాడిలో పెట్టకపోతే పార్టీకే నష్టమన్నారు. ముస్లిం సోదరుల కోసం చంద్రబాబుని కూడ కాదని నిలబడ్డానని పేర్కొన్నారు. తాను. తన అమ్మాయి మేయర్ పదవి కోసం పాటు పడటం లేదని, పార్టీ కోసం కష్టపడుతున్నామని అన్నారు.

 2014లో కూడా విజయవాడ మేయర్ పదవి కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారని, ఈ సారి వేరే సామాజిక వర్గానికి ఇవ్వాలని ఈ ముగ్గురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంటే కమ్మ సామాజికవర్గం కాకుండా అంటే కాపు, బ్రాహ్మణ, ముస్లిం ఈ మూడు వర్గాల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలనే డిమాండ్ తెరమీదకు తీసుకు వచ్చారు.కేశినేని ప్రచారంలో బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, బోండా ఉమ ఎవరూ పాల్గొనడం లేదు. అలాగని వారూ కూడా ఇంకా ప్రచారంలోకి దిగలేదు. టీడీపీలో రెండు గ్రూపుల గొడవతో ఎన్నికల తరవాత మేయర్ ఎవరనేది తేల్చాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 అయితే ఎవరికి వారే విమర్శలతో టీడీపీ పరువు బజారున పడేస్తున్నారు. తాజాగా ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో ఎన్నార్సీకి అనుకూలంగా ఓటు వేయాలని చంద్రబాబు కోరినా, తాను వేయలేదని గుర్తు చేశారు. కేశినేని వ్యాఖ్యలు చూస్తుంటే తన కూతురిని కాకుండా మరెవరైనా మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే తక్షణమే పార్టీ నుండి వెళ్లిపోవటానికి సిద్ధంగా ఉన్నాడనే మాటలు కూడా వినిపిస్తున్నాయి