కొన్ని రోజుల క్రితం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోటి లంచం కేసు గుర్తుందా మీకు. కీసర తహశీల్దార్ నాగరాజు భూవివాదం కేసులో ఏకంగా కోటి రూపాయల లంచం తీసుకుంటూ అడ్డంగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. దీంతో ఆయన్ను వెంటనే చంచల్ గూడ జైలుకు తరలించారు. అక్కడ రిమాండ్ ఖైదీగా నాగరాజు ఉన్నాడు.
ఈ నేపథ్యంలో నాగరాజు.. చంచల్ గూడ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయన మృతదేహాన్ని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
కోట్ల విలువైన భూమిని వేరే పేర్ల మీద మార్చడం కోసం నాగరాజు 2 కోట్ల లంచం డిమాండ్ చేయగా… కోటి రూపాయలు ముందుగా ఆయనకు అందిస్తుండగా.. ఏసీబీ అధికారులు ఆయన్ను రెడ్ హాండెడ్ గా పట్టుకొని.. అవినీతి, లంచం కేసులో అరెస్ట్ చేశారు.