పవన్ జీవితమంతా ఇంతేనా.. ఆ విషయంలో ఎప్పటికీ మారరా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను తలచుకుంటే ఏ పార్టీ అయినా తను చెప్పినట్టే వినాలని భావిస్తున్నారు. అడిగిన స్థాయిలో సీట్లు ఇస్తే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని అలా జరగకపోతే వద్దని అనుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీ.ఆర్.ఎస్ పార్టీ చీల్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ విషయంలో ఏం చేయాలో పవన్ కళ్యాణ్ కు సైతం అర్థం కావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చంద్రబాబును పవన్ సీఎం చేయాలని అనుకుంటున్నా ఏపీలో టీడీపీకి అనుకూల పరిస్థితులు లేవు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఘోరంగా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రాష్ట్రంలో టీడీపీ పుంజుకునే అవకాశాలు కూడా లేవని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం. పవన్ ఏ ప్లాన్ వేసినా ఆ ప్లాన్ రివర్స్ అవుతోంది. పవన్ కళ్యాణ్ జనసేనతో అనుకున్న లక్ష్యాలను సాధించడం కష్టమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

జనం ఎంతో తెలివైన వారు అని పవన్ ను నమ్మి గుడ్డిగా మరోసారి మోసపోయేంత మూర్ఖత్వం ప్రజల్లో లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ పెట్టి తొమ్మిదేళ్లు అవుతుందని ఈ తొమ్మిదేళ్లలో ప్రజల కోసం ఏం చేశారో పవన్ చెబితే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వేస్తున్న అడుగులు తప్పటడుగులే అని తెలుస్తోంది.

రాబోయే రోజుల్లో జనసేన ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. పవన్ కు సినిమా నటుల నుంచి మద్దతు లభిస్తున్నా రాజకీయ నేతల నుంచి మాత్రం మద్దతు లభిస్తోంది. పవన్ పొలిటికల్ గా కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఎప్పుడు షూట్ పూర్తి చేసుకుంటాయో అనే సస్పెన్స్ నెలకొంది.