Home News మద్య నిషేధంపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ కీలక వ్యాఖ్యలు..ఏంచెప్పారంటే?

మద్య నిషేధంపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ కీలక వ్యాఖ్యలు..ఏంచెప్పారంటే?

మద్యపాన నిషేధానికి సంబంధించి తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలను నిషేధిస్తే, తాము కూడా తెంలగాణలో మద్య నిషేధం విధిస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంగళవారం శ్రీనివాస్‌ గౌడ్ సమధానమిచ్చారు. దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తూ.. తెలంగాణలో మాత్రమే మద్య నిషేధం విధిస్తే మాఫియా పెరిగిపోతుందని వ్యాఖ్యానించారు. మద్య నిషేధం విధించడంపై దేశవ్యాప్తంగా నిషేధం విధిస్తే ఆ నిర్ణయాన్ని అమలు చేయడంతో తమ ప్రభుత్వం ముందే ఉంటుందని తెలిపారు.

Minister Srinivas Goud: మద్య నిషేధంపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయన ఎమన్నారంటే..

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్య నిషేధం విధించిన సమయంలో మాఫియా పెరిగిపోయిందన్నారు. తెలంగాణ ఏర్పాటు ముందు 2,216 షాప్‌లు ఉండేవని.. వాటి సంఖ్య ఇప్పటికి పెంచలేదన్నారు. కానీ అలా షాప్‌లు పెంచి ఆదాయం సంపాదించుకునే ఉద్దేశం లేదన్నారు. కానీ మద్యం అమ్మకాలపైనే ప్రభుత్వం ఆదాయం భారీగా పొందుతుందని కొందరు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. అటువంటి ఆరోపణలు చేసినప్పుడు బాధగా ఉంటుందని చెప్పారు. నిబంధనల ప్రకారమే మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. డూపిక్లేట్ మద్యాన్ని ఆరికట్టడానికి అనేక చర్యలు తీసుకున్నామని వివరించారు.

ఇందుకోసం ఎక్సైజ్ శాఖ రాత్రింబవళ్లు పనిచేస్తుందన్నారు. ప్రార్థన మందిరాలు సమీపంలో మద్యం షాప్‌లకు అనుమతులు ఇవ్వలేదని అన్నారు. ఎక్కడైనా జరిగినా అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. శాసనసభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రసంగిస్తున్న సమయంలో.. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభ్యులు సమయం పరిగణలోకి తీసుకొని మాట్లాడాలని సూచించారు. దీనిపై శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ.. “మీరు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి గంట వరకు సమాధానం ఇచ్చారు. అది మేము ఎలా మరిచిపోతాం. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మేం పని చేస్తున్నాం” అని అన్నారు. దీంతో సభలో స్పీకర్‌తో పాటు సభ్యులు నవ్వారు.

Related Posts

Related Posts

Latest News