Tomato Flu Virus: కేరళలో ప్రస్తుతం మరో భయంకరమైన వైరస్ భయపడుతోంది. టమాటా ఫ్లూ అనే ఒక వైరస్ కేరళలో వ్యాపిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో బాధితులు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.కేరళలో వెలుగు చూసిన టమాటా ఫ్లూ వైరస్ తో పలువురు చిన్నారులు తీవ్ర జ్వరం, వాంతులు, విరేచనాలు, ఇతర లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రమాదకర ఈ వైరస్ కారణంగా కొల్లాంలో 80 మంది చిన్నారులు ఆసుపత్రుల పాలయ్యారు.
అత్యంత అరుదైన ఈ వ్యాధి సోకితే చర్మంపై ఎర్రటి బొబ్బలు రావటం, అవి టమాటా ఆకారంలో ఉండడంతోనే దానికి టమాటా వైరస్ గా పేరు పెట్టారు నిపుణులు. ఈ ఫ్లూ బారినపడిన వారిలో తీవ్రమైన జ్వరం, నీరసం, ఒళ్లు నొప్పులు, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు ఉంటాయి. మరికొందరు చిన్నారుల్లో జలుబు, దగ్గు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, చేతులు, మోకాళ్లు, పిరుదులు రంగు మారుతాయని నిపుణులు సూచించారు. కాగా కేరళలో టమాటా ఫ్లూ కేసులు నమోదు కావటంతో కర్ణాటక హై అలర్ట్ ప్రకటించింది.