ముందస్తు ఎన్నికలకు కేసీయార్ సిద్ధమే.! కండిషన్స్ అప్లయ్.!

తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు తాము సిద్ధమేనని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించేశారు. అయితే, ఇక్కడ కండిషన్స్ అప్లయ్ వుంది. ఔను, కేసీయార్ గనుక ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలంటే, దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమవ్వాలి.

కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ గనుక ముందస్తు ఎన్నికలకు వెళితే, తామూ సిద్ధమని కేసీయార్ ప్రకటించేశారు. ఇది నిజంగానే హాస్యాస్పదమైన అంశం. గతంలోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. అప్పుడెందుకు కేసీయార్, బీజేపీ అనుమతి తీసుకోలేదు.. బీజేపీకి షరతు విధించలేదు.?

రాజకీయం అంటేనే అంత.! తెలంగాణలో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగులేదు. కానీ, రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా వుండవ్. ఏమో, కింది స్థాయిలో రాజకీయ పరిణామాలు ఎలా వున్నాయో అంచనా వేయడం కష్టం.

గ్రేటర్ ఎన్నికలు, దుబ్బాక అలాగే హుజూరాబాద్ ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ అనుకున్నదొక్కటి, అయ్యింది ఒక్కటి. సో, ఒకవేళ కేసీయార్ ముందస్తు ఎన్నికలకు వెళితే, అనూహ్యమైన రీతిలో టీఆర్ఎస్ ఘోర పరాభవం బీజేపీ కారణంగా ఎదుర్కోవాల్సి రావొచ్చు.

ఏమో, కాంగ్రెస్ కూడా పుంజుకోవచ్చు. కాంగ్రెస్ లేదా బీజేపీ తొలి రెండు స్థానాల్ని దక్కించుకుని, గులాబీ పార్టీని మూడో స్థానంలోకి నెట్టేస్తోనో.? రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు మరి.!