కాంగ్రెస్ ఎంపీ, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి టీఆర్ ఎస్ ప్రభుత్వంపై ఛాన్స్ దొరికినప్పుడల్లా ఎలా నిప్పులు చెరుగుతారో తెలిసిందే. కేసీఆర్ సర్కార్ పై ఎప్పటికప్పుడు నివురు గప్పిన నిప్పులా ఎగసిపడటం రేవంత్ కే చెల్లింది. పథకాల అమలు తీరును ఎడ్డగటడ్డం, పార్టీ నేతల్ని విమర్శించడం రేవంత్ కు తొలి నుంచి కొట్టిన పిండే. విమర్శలకు తగ్గ అస్ర్తాలను వెదుక్కుని మాటల్ని తూటాల్లా వదలడం రేవంత్ కే చెల్లింది. ఇక కేసీఆర్ ప్రభుత్వానికి కరోనా సంకటంగా మారిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షమే లేదని ఫీలయ్యే కేసీఆర్ కి కరోనా నే పెద్ద ప్రతిపక్షమైంది. కరోనా కేసుల విషయంలో అడ్డంగా దొరికిపోయిన సర్కార్ …చివరికి పరీక్షలు తమ వల్ల కాదంటూ చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. కరోనా పరీక్షలు..వైద్యం ప్రయివేటు పరం చేసింది సర్కార్.
ఇక కేసీఆర్ హైదరాబాద్ చుట్టు ఒక్కొ ఆసుపత్రిని నిర్మించుకుందామని, అందులో భాగంగా గచ్చిబౌలిలో ఓ ఆసుపత్రి ఏర్పాటు చేద్దామని, ఏప్రిల్ లో నే దాన్ని ప్రారంభిద్దామని కూడా చెప్పారు. పదివేల కేసులొచ్చినా డీల్ చేసే సత్తా తమకుందని ప్రగల్భాలు పలికారు. ఆ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని ధైర్యం చెప్పారు. కానీ ఆ ధైర్యం ఎంతో సేపు లేదు. గాంధీలో కరోనా పేషంట్ల పరిస్థితి ఎలా ఉందో? ఇప్పటికే తెలిసిందే. ప్రభుత్వ తీరుపై డాక్టర్లు ఫైర్ అవ్వడం..కరోనా పరీక్షలు చేయడంలో ప్రభుత్వం ఫెయిలైందంటూ హైకోర్టు సాక్షిగా మొట్టికాయలు పడ్డాయి. దీంతో నిమ్స్ ను కొవిడ్ ఆసుపత్రిగా మార్చారు.
అలాగే టిమ్స్ ఆసుపత్రిని వాడుకుందామన్నారు కేసీఆర్. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి టిమ్స్ ని సందర్శించి అందులో ఎలాంటి సదుపాయాలు లేవని…ప్రస్తుతం అందులో కుక్కలు మాత్రమే తిరుగుతున్నాయన్నారు. ఇది ఆరోపణ కాదు నిజమే. దీంతో కేసీఆర్ అడ్డంగా దొరికపోడంతో ఆయనగారివి అన్నీ గారిడీ మాటలే. గొప్పలు తప్ప చేసే పనులుండవని ఎద్దేవా చేసారు. టిమ్స్ లో సరైన డ్రైనేజీ సిస్టమ్ కూడా లేదన్నారు. ఇంతలో ఉన్న పళంగా టిమ్స్ లో వైద్యులను, ఇతర సిబ్బందిని నియమించాలని తెలంగాణ సర్కార్ నోటిపికేషన్ విడుదల చేసింది. 499 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. పరిస్థితులన్నీ సక్రమంగా ఉన్నప్పుడే రాష్ర్టంలో అప్పుల్లో ఉందని ఉద్యోగ నొటిఫికేషన్లు వేయనని చెప్పిన కేసీఆర్ ఒక్కసారిగా 400కు పైగా పోస్టులను భర్తీ చేయడంతో ఇదంతా రేవంత్ పుణ్యమంటూ నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.