ప్రధాని పీఠం ఎక్కడం కోసం .. కే‌సి‌ఆర్ లేనిపోని డేంజర్ జోన్ లోకి వెళుతున్నాడా ?

kcr-Modi

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. తెలంగాణాలో రెండోవ సారి కూడా విజయాన్ని అందుకున్న తర్వాత ఎంతో ఆత్మ విశ్వాసంతో ఉన్నారనిపిస్తుంది.. ఇక తెలంగాణ సీయం పదవిని తన కుమారునికి అప్పచెప్పి తాను జాతీయస్దాయిలో రాజకీయాలు చేయాలనే ఆరాటం రోజు రోజుకు ఎక్కువవుతుండగా ఆ ఆశను కూడా నెరవేర్చుకోవడానికి అడుగులు వేస్తున్నారనే వార్త జోరుగా వినిపిస్తుంది.. ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం గులాబీ బాస్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారట.. కాగా బయటకు తెలియకుండా జరుగుతున్న కొన్ని పరిణామాలను పరిశీలిస్తే ఇది నిజమని తేలుతోందంటున్నారు కొందరు..

అదీగాకుండా గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాను, ఫెడరల్ ఫ్రంట్ వేదికను ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే అంతర్గతంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.. ఇదే విషయంలో పత్రికలు కోడై కూస్తున్న ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ నేతలు గానీ, కేసీఆర్ గాని ఇది అబద్ధం అని కొట్టిపారేయలేదు.. అంతే కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ నేతలు గత నాలుగు నెలల నుండి విమర్శలు చేస్తూనే ఉన్నారు. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా జాతీయ స్థాయిలో కేసీఆర్ “నయా భారత్” అనే పార్టీ పెట్టి, దాన్ని బలోపేతం చేయడం కోసం చాలా పెద్ద రిస్క్ చేయడానికి కూడా వెనకాడటం లేదనేది ఒక టాక్..

 

అయితే ఇదివరకు ఒకసారి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అనీ హడావిడి చేశారు. ఎన్నికల తర్వాత.. లోక్ సభ ఎన్నికల సమయంలో కారు, సారు, పదహారు అని నినాదించారు. కానీ ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. దీంతో తెలంగాణ పాలనపై దృష్టిసారించారు. కానీ బీజేపీ మరింత దూకుడుగా అడుగులు వేయడంతో, కేసీఆర్ కూడా అదేరీతిన స్పందిస్తున్నారు. 2022 చివరలో.. లేదంటే 2023లో జమిలి ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ఆ లోపల “నయా భారత్” పార్టీని బలోపేతం చేయాలని అనుకుంటున్నారట తెలంగాణ ముఖ్యమంత్రి.. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మోడీ పై వ్యతిరేకత తీసుకురావాలని ఇప్పటి నుండే కేసీఆర్ యోచన చేస్తున్నారనే వార్తలు నేషనల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

ఏది ఏమైనా త్వరలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జాతీయస్థాయిలో రాజకీయాలు చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు బలంగా వినబడుతున్నాయి. కానీ ఈ వ్యూహం గనుక వికటిస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం.. అదీగాక కేసీఆర్ ప్రధాని పీఠం ఎక్కడం కోసం లేనిపోని సాహాసాలు చేస్తూ, డేంజర్ జోన్ లోకి వెళుతున్నాడా అనే అనుమానాలు కూడా కొందరిలో కలుగుతున్నాయట. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొంతకాలం ఆగవలసిందే..