తెలంగాణ టీడీపీకి రమణ గుడ్ బై చెప్పబోతున్నాడా..?

l ramana

 తెలుగుదేశం పార్టీ ఒక జాతీయ పార్టీ అని చెప్పుకోవటం తప్ప ఆ హోదా లో ఉంది చేసేది ఏమి లేదు. కనీసం తెలుగు రెండు రాష్ట్రాల్లో పార్టీని నడిపించలేని స్థితికి చేరుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణ లో అయితే తెలుగుదేశం పార్టీ ఒక్కప్పుడు ఉండేది అని చెప్పుకునే విధంగా దారుణమైన స్థితికి చేరుకుంది. కనీసం పార్టీకి సంబంధించిన చిన్న చిన్న కార్యక్రమాలు చేసే నేతలు కూడా ఇప్పుడు కరువైయ్యారు.

l ramana

 చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ టీడీపీ విషయంలో పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించటం లేదు. నాయకత్వ విషయంలో మార్పులు చేయవలసి ఉన్నకాని వాటి గురించి ఆలోచించే స్థితిలో కూడా లేదు బాబు. దీనితో అంతో ఇంతో పార్టీని నమ్ముకొని ముందుకు సాగుతున్న కొద్దీపాటి క్యాడర్ కూడా నిరాశ పడిపోయింది. దీనితో కొంతమంది నేతలు పార్టీ నుండి బయటకు వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ముందు నుంచి కూడా ఉంది.

 సొంత పార్టీ నేతలే తెలుగుదేశం మీద నమ్మకం లేకుండా ఉన్నట్లు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ లో పార్టీ మనుగడ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రమణ కూడా సమర్థవంతంగా పని చేయలేకపోవడం కాస్త ఇబ్బంది అని అంటున్నారు. అయితే ఇక్కడ గమ్మతైనా విషయం ఏమిటంటే ఆయన కూడా టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 తాజాగా తెలంగాణలో జరుగుతున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రమణ పోటీచేయబోతున్నాడు. ఆయనే ఈ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై సొంత పార్టీలోనే ఏకాభిప్రాయం లేదని సమాచారం. కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చడానికి మాత్రమే ఆయన పోటీ చేస్తున్నారు అనే వ్యాఖ్యలు కూడా టీడీపీ నేతల నుండి వినబడుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటి వరకు రమణ కూడా ఎలాంటి సంజాయిషి పార్టీ అధిష్టానానికి ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే ఆయన తీసుకున్న నిర్ణయంపై పార్టీ నాయకత్వం అడిగిన దానికి రమణ మరో కోణంలో సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించకలేపోతే పార్టీ నుండి బయటకు వెళ్లిపోతానని, ఒక వేళా ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపిస్తే పార్టీలోనే కొనసాగుతానని చెప్పినట్లు తెలుస్తుంది. రమణ మాటలు గమనిస్తే ఇందులో ఎదో పెద్ద లాజిక్ వున్నట్లే అనిపిస్తుంది.