రేవంత్ రెడ్డి సభకు ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం ఉన్నట్లేనా..? కీలక సమాచారం లీకైందా..?

Revanth Reddy padayatra

 తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇతర పార్టీల్లో కావచ్చు ఇప్పుడు జరుగుతున్నా చర్చ ఒకటే, రేవంత్ రెడ్డి చేప్పట్టిన మినీ పాదయాత్రకు ఢిల్లీ పెద్దల అనుమతి ఉందా..? లేదా..? అని. రైతు సమస్యలను తెలుసుకోవటం, అదే విధంగా రైతు వ్యతిరేక చట్టాలపై అవగాహనా కల్పించటం కోసమంటూ ఈ నెల 7న ఎంపీ రేవంత్ రెడ్డి రాజీవ్ రైతు భరోసా దీక్షలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా నుండి పాదయాత్రను ప్రారంభించాడు.

revanth reddy

 దాదాపు 149 కిమీ సాగిన ఈ పాదయాత్ర రంగారెడ్డి జిల్లా రావిర్యాల వరకు సాగింది. ఈ సందర్భంగా అక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాడు రేవంత్ రెడ్డి. ఈ పాదయాత్రకు ఢిల్లీ కాంగ్రెస్ నాయకత్వం అనుమతి లేదని సాకుగా చూపిస్తూ కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఈ సభకు హాజరుకాలేదు. కానీ చాలా వరకు మిగిలిన కాంగ్రెస్ నేతలు ఈ సభకు హాజరై సూపర్ సక్సెస్ చేశారనే చెప్పాలి.

 రేవంత్ రెడ్డి సభకు కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, మాజీ ఎంపీలు సురేష్ షట్కర్, సిరిసిల్ల రాజయ్య, మల్లు రవి, పరిగి మాజీ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, కొండా సురేఖ, సంబాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యేలు గంగారాం, మల్‌రెడ్డి రంగారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, విజయ రమణా రావు, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు.

Revanth Reddy padayatra

 ఈ సభకు అనుమతి లేదని సీనియర్ నేతలు వాదిస్తూ, పార్టీ ఇంచార్జి మాణికం ఠాగూర్ కు ఈ విషయంపై ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తుంది. కానీ ఈ సభకు ఢిల్లీ పెద్దల అనుమతి ఉన్నట్లు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు గమనిస్తే అర్ధం అవుతుంది. అదే విధంగా ఈ సభలో రేవంత్ కొన్ని హామీలు కూడా ఇచ్చాడు, ఢిల్లీ అనుమతి ఉంది కాబట్టే ఈ హామీలు ఇచ్చినట్లు కూడా కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. పైగా తర్వలోనే మరోసారి ఢిల్లీ పెద్దల అనుమతి తీసుకోని తెలంగాణ రాష్ట్రము మొత్తం పాదయాత్ర చేస్తానని ఈ వేదిక మీద నుండే రేవంత్ రెడ్డి ప్రకటించటం చూస్తే, లోలోపల రేవంత్ కు పార్టీ పెద్దల అభయం ఉందని తెలుస్తుంది.

ఇప్పటికే ఈ పాదయాత్రకు, ఈ సభకు వచ్చిన స్పందన గురించి పార్టీ హైకమాండ్ కు సమాచారం వెళ్లినట్లు తెలుస్తుంది. అనుకున్న స్థాయి కంటే ఎక్కువగానే ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యిందని ఢిల్లీ స్థాయిలో చెప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. దీనిని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఢిల్లీ పెద్దల పూర్తి మద్దతు రేవంత్ రెడ్డికే అని చెప్పవచ్చు