అబ్బెబ్బే అదేంకుదరదు , అప్పుడే మాట మార్చిన కే‌సి‌ఆర్ ?

kcr special meeting on prc at pragathi bhavan

 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలి గురించి కొత్తగా చెప్పే పని లేదు. చేయాలి అనుకున్న పనిని ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే సాధించే దాక నిద్రపోని నైజం ఆయనది. ముఖ్యమంత్రి అయిన మొదటి నుండి కొత్త సచివాలయం నిర్మించాలని కేసీఆర్ భావించాడు. అయితే అనేక ఇబ్బందులు తలెట్తతంతో సచివాలయం నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చాడు. అదే సమయంలో అసలు సచివాలయం ముఖమే చూడకుండా అన్ని పనులు ప్రగతి భవన్ నుండే చక్కబెడుతూ వచ్చాడు.

CM KCR

 ఇక కేసీఆర్ కళల సౌధం సచివాలయం నిర్మాణం చాలా సార్లు తెలంగాణకు కొత్త సచివాలయం కట్టాలని సీఎం కేసీఆర్ మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కలలు కంటున్నారు. చాలా సార్లు శంకుస్థాపన వరకూ వెళ్లింది. కానీ సాధ్యం కాలేదు. ఓ సారి ఎర్రగడ్డ అన్నారు..మరోసారి బైసన్ పోలో గ్రౌండ్స్ అన్నారు. దాదాపుగా అన్ని ప్రయత్నాలూ చేశారు. చివరికి ఎక్కడా కుదరలేదు. కానీ ఎన్నికల ఫలితాలు కలసి రావడంతో ఏపీకి కేటాయించిన భవనాలన్నింటినీ స్వాధీనం చేసుకుని… కూలగొట్టేసి..ప్రస్తుతం ఉన్న చోటే విశాలమైన స్థలం క్రియేట్ చేసుకుని… కొత్త సచివాలయ నిర్మాణం ప్రారంభించారు. కానీ అనుకున్నట్లుగా సాగడం లేదు. పర్యావరణ అనుమతుల పేరుతో ఇంత కాలం లేట్ అయింది. ఇటీవల పనులు ప్రారభించారు. తెలంగాణ కొత్త సెక్రటేరియట్ అన్ని హంగులతో.. తెలంగాణ సాంస్కృతిక వైభవం కళ్లకు కట్టినట్లుగా సిద్ధమవనుంది.

 మొదట ఆరు నెలల్లో సచివాలయం కట్టాలని నిర్ణయం తీసుకున్న కానీ, అక్కడ జరుగుతున్నా పరిస్థితులను చూస్తే ఆరు నెలల్లో పూర్తికావటం సాధ్యం కాదని తెలుస్తుంది. తాజాగా సీఎం కేసీఆర్ తన షెడ్యూల్ లో లేకపోయినా కానీ ఆయన సచివాలయం పనులు పరిశీలించడానికి వెళ్లారు. అయితే అక్కడ జరుగుతున్నది చూసిన కేసీఆర్ తాను అనుకున్నది వేరు… జరుగుతున్నది వేరని అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద నిర్మాణయంత్రాలతో.. చురుగ్గా పనులు సాగుతాయని ఆయన ఆశించినట్లుగా ఉన్నారు కానీ.. ఇంకా అక్కడ పునాదులు కూడా పూర్తి కాలేదు. చాలా పునాదులు ఇంకా తవ్వేదశలోనే ఉన్నారు. కింద రాళ్లు ఉన్నాయని అందుకే ఆలస్యం అవుతోందని నిర్మాణ సంస్థల ప్రతినిధులు వివరణ ఇచ్చారు. ఏం చెప్పినా సరే ఏడాదికి మించి సమయం ఇవ్వబోమని.. ఆ లోపు కట్టాల్సిందేనని కేసీఆర్ తేల్చి చెప్పారు.

 కొత్తగా కట్టబోతున్న సచివాలయంలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అందులో భాగంగానే మొదట ఆరు నెలల్లోనే నిర్మాణం పూర్తిచేయాలని కేసీఆర్ ఆదేశించి నిధులు కూడా విడుదల చేశారు , కానీ క్షేత్ర స్థాయిలో జరుగుతున్నా పరిణామాలు అందుకు అనుకూలంగా లేకపోవటంతో ఆరునెలల సమయాన్ని ఏడాదికి పొంగించినట్లు తెలుస్తుంది. అది పూర్తి అయిన వెంటనే నూతన సచివాలయం భవన్ లో కేటీఆర్ నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం మెండుగా ఉన్నట్లు తెలుస్తుంది.