KCR In Deep Shock : యూపీలో బీజేపీ గెలుపుతో కేసీయార్ అంతలా షాక్ అయ్యారా.?

KCR In Deep Shock :  ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఊహించని రీతిలో సాక్ ఇచ్చాయా.? అంటే, ఔననే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లో అక్కడి అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే, తెలంగాణ ముఖ్యమంత్రికి అవి ఎలా షాక్ ఇస్తాయి.? అంటే, అక్కడ బీజేపీ గెలిచింది గనుక.. ఆ బీజేపీ, తెలంగాణలో కేసీయార్ పార్టీకి ధీటుగా ఎదుగుతోంది గనుక.! జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీయార్ ఆశల మీద ఈ మొత్తం వ్యవహారం నీళ్ళు చల్లినట్లయ్యింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తన ఆమ్  ఆద్మీ పార్టీని పంజాబ్‌లో కూడా గెలిపించి, తన పార్టీని జాతీయ పార్టీగా మలచారు. ఆలెక్కన అరవింద్ కేజ్రీవాల్ రూపంలో కూడా కేసీయార్‌కి షాక్ తగిలినట్లే అయ్యింది. కేసీయార్, మమతా బెనర్జీ.. వీళ్ళు ఇంకా జాతీయ నాయకులవుదామనే ఆలోచనలో వుండగా కేజ్రీవాల్ జాతీయ నాయకుడైపోయారు.

సో, కేసీయార్ ఒకవేళ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటే, ఇప్పుడు కేసీయార్ ముందున్న ఆప్షన్ ఒక్కటే.. అరవింద్ కేజ్రీవాల్‌తో చేతులు కలపడం. మమతా బెనర్జీది అయినా అదే పరిస్థితి.

యూపీలో బీజేపీ దెబ్బ తింటుందనీ, తన రాజకీయ వ్యూహాలు ఫలిస్తాయనీ భావించిన కేసీయార్, ఇప్పుడు తెలంగాణలో తాను గెలవడం ఎలా.? అన్నదానిపై స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ‘డబుల్ ఇంజిన్’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ తెరపైకి తెచ్చిన కొత్త రాజకీయ వ్యూహానికి కేసీయార్ చిత్తయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

కాగా, యూపీ విషయంలో తమ అంచనాలు దెబ్బతిన్నమాట వాస్తవమే అయినా, ఆ ఎన్నికలు తమ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపవన్నది గులాబీ నేతలు తాజాగా చేస్తున్న వ్యాఖ్యల సారాంశం.