కాంతారా ఓటిటి లో రిలీజ్ ఎప్పుడంటే…

సినిమా హిట్ అవ్వాలంటే భారీ కాస్టింగ్, భారీ బడ్జెట్ అవసరం లేదని చాలా సినిమాలు నిరూపించాయి. ‘కార్తికేయ 2 ‘ చిన్న బడ్జెట్ తో రూపొంది భారీ హిట్ సాధించింది. అలాగే హై బడ్జెట్ తో వచ్చిన ‘రాధే శ్యామ్’ డిసాస్టర్ గా నిలిచింది.

రీసెంట్ గా కన్నడంలో చాలా చిన్న సినిమాగా విడుదలై.. అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం కాంతారా.  ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా కన్నడలో వంద కోట్లు వసూలు చేసింది. దీనిని తెలుగు లో అల్లు అరవింద్ రిలీజ్ చేసాక ఈ సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి.

తెలుగు ఆడియన్స్ కి అస్సలు పరిచయం లేని రిషబ్ శెట్టి హీరో గా, డైరెక్టర్ గా చేసిన ఈ సినిమా తెలుగు లో కూడా సూపర్ హిట్ టాక్ అందుకుంది. శాండిల్ వుడ్ లో కేజీఎఫ్ 2 తర్వాత మళ్లీ ఆ స్థాయి వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే కావడం విశేషం.

థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా సమాచారం ప్రకారం ఈ మూవీ ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.

తాజా సమాచారం ప్రకారం నవంబర్ 4వ తేదీన ఈ సినిమా కన్నడ వెర్షన్ ఓటీటీలో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనిపై ప్రైమ్ వీడియో ఇంకా ఆఫిసిఅల్ అనౌన్స్మెంట్ ఇవ్వాల్సి ఉంది.