Kannada Actor: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి తర్వాత ఒకరు సెలబ్రిటీలు చనిపోతున్న విషయం తెలిసిందే. ఇలా ఒకరి చనిపోయిన బాధను మర్చిపోకముందే, ఆ బాధ నుంచి ఇంకా తేరుకోక ముందే మరొక సెలబ్రిటీ మరణిస్తున్నారు. అలా తాజాగా సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకుంటున్న ఒక యంగ్ హీరో మరణించారు. ఇలా గత కొన్నేళ్లలో మరణాలు ఆశ్చర్యకర రీతిలో ఉంటున్నాయి.
చిన్న వయసులోనే చాలామంది తుదిశ్వాస విడుస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక యంగ్ హీరో కూడా జాండీస్ తో బాధపడుతూ కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరు అన్న విషయానికి వస్తే.. కన్నడ ఇండస్ట్రీలో నటుడు అనెకల్ బాలరాజు నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన వారసుడు సంతోష్ బాలరాజు. 2009లో కెంప సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం గణప, బర్కెలీ, సత్య, కరియా 2 లాంటి సినిమాలలో నటించి మెప్పించారు.
గత కొన్నేళ్ల నుంచి మాత్రం సంతోష్ నటుడిగా కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. కాగా కాలేయం, మూత్రపిండాల్లో సమస్యల కారణంగా గత నెలలో జాండీస్ బారిన పడ్డాడు. దీంతో ఐసీయూలో చికిత్స అందిస్తూ వచ్చారు. తాజాగా మరోసారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. సంతోష్ కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యులు ప్రయత్నాలు చేసినా సరే ప్రాణాలు కాపాడలేకపోయారు. బెంగళురూలోని కుమారస్వామి లేఔట్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం కన్నుమూశారు. దీంతో కన్నడ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Kannada Actor: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. చిన్న వయసులోని మృతి చెందిన హీరో!
