Gopala Rao: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సీరియల్ నటుడు గోపాలరావు కన్నుమూత!

Gopala Rao: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నటుడు అయినా అల్లం గోపాలరావు తాజాగా కన్నుమూశారు. గోపాలరావు ఎన్నో సినిమాలలో సీరియల్స్ లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా చాలా సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు గోపాలరావు. ఇకపోతే ఆయన వయసు ప్రస్తుతం 75 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తాజాగా తన నివాసంలో అనారోగ్యం కారణంగా తుదిస్వాస విడిచారు.

ఆయన మరణంతో తెలుగు సినీ, టీవీ, రంగాలలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మరణ వార్త గురించి తెలుసుకున్న కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. కాగా గోపాలరావు భార్య పేరు విమల. ఈ దంపతులకు సునీల్ అనిల్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. పెద్ద కుమారుడు అనిల్ ఇప్పుడు సీరియల్స్ చేస్తూ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే గోపాలరావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు పలువురు సినీ, టీవీ ప్రముఖులు.

కాగా ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ మేనేజ్మెంట్ కమిటీ గోపాలరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఆయన అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు మహా ప్రస్థానంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గోపాలరావు ఇప్పటికీ పలు సీరియల్స్ లో కనిపిస్తుంటారు. మేఘ సందేశం, నిండు నూరేళ్ల సావాసం వంటి సీరియల్స్ లో నటించిన విషయం తెలిసిందే. ఎక్కువ శాతం తెలుగు సీరియల్స్ లో పాజిటివ్ క్యారెక్టర్లలో నటించి మెప్పించారు గోపాలరావు. అలాగే వెండితెరపై, బుల్లితెరపై కొన్ని వందల పాత్రలను పోషించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బుల్లితెరపై టాప్ స్థానంలో దూసుకుపోయిన గుప్పెడంత మనసు సీరియల్ లో మంత్రిగా కొన్ని ఎపిసోడ్స్ లో కనిపించారు గోపాలరావు. అలాగే ప్రస్తుతం ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్లో జడ్జ్ పాత్రలో అప్పుడప్పుడు కనిపించారు. కానీ అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆయన తుది శ్వాస విడిచారు.