తెలుగు హృదయాలను గెలుచుకున్న కన్నడ నటుడు.. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా నిఖిల్!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 నిన్నటితో ముగిసింది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ షో లో 22 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. మామూలుగా ఈ గేమ్ విన్నర్ కి 50 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు కానీ సీజన్ 8 విన్నర్ కి మాత్రం 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు మారుతి సుజుకి కారుని కూడా ఇవ్వబోతున్నారు. గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్, అవినాష్ లు ఫైనల్ రౌండ్ కి చేరుకున్నారు.

అయితే చాలా సమయం తర్వాత నిఖిల్, గౌతమ్ టాప్ టు ప్లేస్ కి చేరుకున్నారు. అయితే ఈ షో కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన రామ్ చరణ్ చాలాసేపు హైడ్రామా తర్వాత నిఖిల్ ని విన్నర్ గా ప్రకటించారు. గౌతమ్ కృష్ణ రన్నరప్ గా నిలిచాడు. అయితే చాలా కొద్ది ఓట్లు తేడాతో సెకండ్ ప్లేస్ కి వచ్చేసిన గౌతమ్ కృష్ణ నిఖిల్ కి గట్టి పోటీ ఇచ్చాడు. షో విన్ అయిన నిఖిల్ కి విన్నర్ ట్రోఫీతో పాటు 55 లక్షల క్యాష్ ప్రైస్ కూడా రామ్ చరణ్ బహుకరించారు.

తర్వాత గేమ్ చేంజర్ మూవీ ముచ్చట్లు చెప్పారు రామ్ చరణ్. అయితే నిఖిల్ విన్నర్ అవ్వటానికి ముందు నాగార్జున సూట్ కేస్ తో హౌస్ లోకి వెళ్లి టాప్ టు కంటెస్టెంట్స్ కి మరొకసారి ఆఫర్ చేశాడు ఇందులో ప్రైజ్ మనీ మొత్తం కూడా ఉండొచ్చని చెప్పినా ఇద్దరు కంటెస్టెంట్లు వద్దని చెప్పటం గమనార్హం. ఆ సూట్ కేస్ తీసుకుంటే ప్రేక్షకులు తమపై చూపిన ప్రేమను మోసం చేసినట్లు అవుతుందని నిఖిల్ చెప్పాడు.

గోరింటాకు సీరియల్ తో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. ఇక ఈ షోలో నిఖిల్ 55 లక్షల ప్రైజ్ మనీ తో పాటు 15 వారాలపాటు బిగ్ బాస్ లో ఉన్నందుకు వారానికి రెండు లక్షల 25వేల రెమ్యూనరేషన్ చొప్పున 33, 75000 రూపాయల పారితోషకం అందుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో జీఎస్టీ కింద చాలా వరకు పోతుంది, చేతికి తక్కువే వస్తుంది అంటున్నారు నెటిజన్స్.