కళాశాలలో ర్యాగింగ్ నిషేధించబడింది. కానీ ఇప్పటికీ కొన్ని కళాశాలలో ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు జూనియర్లను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వేధింపులకు భరించలేక ప్రీతి అనే వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడి ఐదు రోజులపాటు నృత్యంతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. డాక్టర్ కావాలన్నా కోరికతో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రీతి ప్రస్తుతం వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చేస్తోంది.అలాగే మరోవైపు ఆస్పత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తోంది. చదువులో ఎంతో చురకైనా ప్రీతిని కళాశాలలో సీనియర్ విద్యార్థి తరచూ వేధింపులకు గురి చేసేవాడు. అతని వేధింపుల గురించి కళాశాల యాజమాన్యానికి పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా ఎటువంటి ఫలితం లేకపోయింది.
రోజురోజుకీ అతని ఆగడాలు మితిమీరటంతో ప్రీతి ఆ వేధింపులు భరించలేక ప్రాణాంతకమైన ఇంజక్షన్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఆమెను మెరుగైన వైద్యం కోసం వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే గుండె ఆగిపోతే సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఇక హైదరాబాద్ నిమ్స్‌లో ఎక్మో సపోర్ట్ తో ఆమెకు చికిత్స అందించారు. అయితే ప్రీతి బ్రెయిన్‌డెడ్ అవటం వల్ల ఆదివారం సాయంత్రం కన్ను మూసింది. డాక్టర్ అయ్యి సమాజానికి సేవ చేయలకున్న కూతురూ ఇలా తను చాలించటంతో ఆమె తల్లిదండ్రుల కుటుంబ సభ్యులు రోధన వర్ణాతీతంగా మారింది. ప్రీతి ఆత్మహత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు కూడా నిందితున్ని దారుణంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిమ్స్ ఆస్పత్రికి వెళ్ళారు. అక్కడ ప్రీతి తల్లిదండ్రులతో చర్చించిన ఆయన వారిని ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. అంతే కాకుండా ప్రీతి ఆత్మహత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఇక సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ప్రీతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ప్రీతి తన తల్లితో మాట్లాడిన రికార్డింగ్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.