కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం ‘బింబిసార’. కొద్దిసేపటి క్రితమే టైటిల్, ఫస్ట్ లుక్ అనౌన్స్ చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్ బింబిసార అనే రాజు పాత్రను చేస్తున్నారు. బింబిసార చరిత్ర చాలా పురాతనమైంది. అర్థమయ్యేలా చెప్పాలంటే బుద్దిని కాలం నాటిది. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం చివరకు చెందిన రాజు. మగధ సామ్రాజ్యాన్ని పాలించాడు. 15 ఏళ్ల వయసులోనే సింహాసనాన్ని అధిష్టించి మగధ రాజ్యానికి పునాధులు వేశాడు. ఈయన చరిత్ర మొత్తం భీకర యుద్దాలు, పోరాటాలే. అలాంటి రాజు పాత్రలో కళ్యాణ్ రామ్ నటించనున్నాడు.
ఫస్ట్ లుక్ టీజర్లో కళ్యాణ్ రామ్ లుక్ పరంగా ఒకింత ఆకట్టుకున్నాడనే అనాలి. కానీ సినిమా ఎలా ఉండబోతుంది అనేదే ప్రశ్న. ఇదొక టైమ్ ట్రావెల్ సబ్జెక్ట్. దీన్నిబట్టి సినిమా మొత్తం బింబిసారుడి కథ కాదని అనిపిస్తోంది. కొద్ది భాగం మాత్రమే మగధ రాజ్యం, బింబిసారుడి చరిత్ర ఉంటాయని, మిగతా కథ వేరేలా ఉంటుందని అనిపిస్తోంది. పూర్తిగా బింబిసార మీదనే సినిమా చేయాలి అంటే బడ్జెట్ భారీగా అవుతుంది. అందుకేనేమో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఎంచుకుని చరిత్రని లీలగా టచ్ చేశారని అనిపిస్తొంది. మరి కళ్యాణ్ రామ్ అండ్ టీమ్ ఏం చేశారు అనేది తెలియాలి అంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.