సోషల్ మీడియాలో కల్వకుంట్ల ఫ్యామిలీకి సరిలేరెవ్వరు

ల్యాండ్ మాఫియా తోపాటు  కబ్జాకోరులు ఇకపై సామాన్యుడి ఆస్థిపై కన్నేయకుండా ధరణి పోర్టల్ తో  శాశ్వతమైన రక్షణ కల్పించింది తెలంగాణ సర్కార్. భూరికార్డులను సమూలంగా , శాశ్వతంగా ప్రక్షాళన గారించిన ఖ్యాతిని మూటగట్టుకుంది కేసీఆర్ సర్కార్. మెరుగైన పాలనకు డిజిటల్ సర్వీసులను ఎంత   భేషుగ్గా వాడుకోవచ్చో యావత్ దేశానికి చాటి చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ తన విజన్ తో  సంవత్సరాల తరబడి కసరత్తు చేస్తే ఇప్పుడు  ఈదసరాకు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది ధరణి పోర్టల్.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి సీఎం చంద్రబాబు…మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈగవర్నెన్స్ కు అంకురార్పణ చేయగా… డిజిటల్ సర్వీసులను ప్రజలకు మరింత చేరువ చేసింది కేసీఆర్ సర్కార్.  ఇక పాలనపరమైన అంశాలను కాసేపు పక్కన పెడితే…. కల్వకుంట్ల ఫ్యామిలీ డిజిటల్ మీడియాలో దుమ్మురేపుతోంది. సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్, కవిత, కేటీఆర్ దూసుకుపోతున్నారు. అందరికంటే  కేటీఆర్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రజాసమస్యలను ట్విట్టర్లోలో స్వీకరించి వాటిని అధికారులకు ట్యాగ్ చేసి… పని పూర్తి అయిన తర్వాత సదరు ఫిర్యాదుదారుడికి మళ్లీ రీట్యాగ్ చేసి విష్ చేస్తున్నారు.

దీంతో సోషల్ మీడీయాలో కేటీఆర్ ఫాలోవర్స్ నానాటికి పెరిగిపోతున్నారు. ప్రస్తుతం 6,85,546 మంది ఫాలోవర్స్ తో దుమ్మురేపుతున్నారు కేటీఆర్. ఇక ఫేస్ బుక్ లో కూడా యువమంత్రి ఫాలోవర్స్ ఐదులక్షలు దాటేశారు. ఇతర రాష్ర్టాలతో పాటు ఇతర దేశాల నుంచి కూడా ఫాలోవర్స్‌ ఉన్నారు. తెలంగాణ యువత పెద్ద సంఖ్యలో గల్ప్ దేశాల్లో పని చేస్తుండండతో సౌదీ తదితర దేశాల్లోంచి చాలా మంది కేటీఆర్ ను ఫాలో అవుతున్నారు.

ఇక దక్షిణభారతవనిలో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న మహిళా నేతగా కల్వకుంట్ల కవిత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో కవితను ఏకంగా పదిలక్షల మంది ఫాలో  అవుతున్నారు.

ఇక  సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా పాతకాలం మనిషే అయినా అధునికతను అందిపుచ్చుకోవడంతో తన తోటి వారికంటే చాలా ముందున్నారు.  టాప్‌-10 రాష్ర్టాలను పరిశీలిస్తే ఫాలోవర్స్ లో తెలంగాణ సీఎంవో ట్విట్టర్‌లో మొదటి స్థానంలో, ఫేస్‌బుక్‌లో మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం తెలంగాణ సీఎంఓ ట్విట్టర్ ఖాతాను 17 లక్షల మంది, ఫేస్ బుక్ ఖాతాను ఎనిమిది లక్షల మంది ఫాలో అవుతున్నారు.