Kajal: లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కాజల్ తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది. తెలుగు, హిందీ,తమిళ్, వంటి ఎన్నో భాషలలో నటించి మాంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొంత కాలం మాత్రమే బాగా ఆఫర్స్ వస్తాయి. కానీ కాజల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటివరూ ఎన్నో ఆఫర్స్Kajal, tollywood, heroine, uae golden visa, twitter వస్తూనే ఉన్నాయి. గౌతమ్ కిచ్లు నీ పెళ్లి చేసుకొని వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం కాజల్ ప్రెగ్నెన్సీ విషయం అందరికి తెలిసిందే.
ఇటీవల కాజల్ కి అరుదైన వీసా లభించింది. యూఏఈ కి చెందిన గోల్డెన్ వీసా కాజల్ కి లభించింది.
ఈ విషయం గురించి కాజల్ ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. చాలా తక్కువ మందికి లభించే ఈ గోల్డెన్ వీసా కాజల్ కు లభించడం విశేషం. కాజల్ యూఏఈ గోల్డెన్ వీసా నీ ఆ కంపెనీ ప్రతినిధి మహమద్ షానిద్ అసిఫలి చేతుల మీదుగా అందుకుంది.
ఈ సంతోషకరమైన విషయాన్ని కాజల్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ..” యూఏఈ గోల్డెన్ వీసా లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. యూఏఈ దేశం మన లాంటి కళాకారులను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుంది. సందర్భంగా యూఏఈ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముందు ముందు ఆ దేశం కోసం పనిచేసి భవిష్యత్తులో ఆదేశం సహకారాల కోసం ఎదురు చూస్తున్నాను”. అంటూ ట్వీట్ చేసింది.యూఏఈ బేస్డ్ జుమా అల్మ్ హిరీ బిజినెస్ కన్సల్టేషన్ సంస్థ ద్వారా కాజల్ ఈ గోల్డెన్ వీసా పొందింది.
