పెళ్లి తర్వాత కూడ కాజల్ ఈ స్థాయిలో ఎలా వసూలు చేస్తోంది ?

Kajal Aggarwal gets highest remuneration in her career
Kajal Aggarwal gets highest remuneration in her career
 
కాజల్ అగర్వాల్ అంటే ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరు.  దాదాపు అందరు పెద్ద హీరోలతోనూ సినిమాలు చేసేసింది.  పెళ్లికి ముందువరకు కూడ ఆమెకు పెద్ద సినిమాల ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.  అలా వచ్చినవే ‘ఆచార్య, ఇండియన్-2’ సినిమాలు.  అయితే పెళ్లి తరువాత ఏ హీరోయిన్ క్రేజ్ అయినా కాస్త మసకబారడం మామూలే.  అలా కాజల్ అగర్వాల్ కు కూడ ఆఫర్లు కాస్త తగ్గాయి.  మునుపటిలా స్టార్ హీరోల సినిమాలకు ఆమె పేరు పరిశీలనలో ఉండట్లేదు.  అందుకే కాజల్ హీరోయిన్ ఒరియెంటెడ్ చిత్రాలకు సైన్ చేస్తోంది.   
 
ఇటీవల ఆమె బాలీవుడ్లో ‘ఉమా’ అనే చిత్రానికి ఒప్పుకుంది.  ఈ సినిమాను నూతన దర్శకుడు తతగత సింఘా డైరెక్ట్ చేయనున్నాడు.  మిరాజ్ గ్రూప్ బ్యానర్ పై అవికేష్ ఘోష్ – మంతరాజ్ పాలివాల్ సినిమాను నిర్మించనున్నారు.  పూర్తిస్థాయి ఫన్ ఎంటర్టైనర్ ఇది.  మామూలుగా అయితే కాజల్ అగర్వాల్ ఉండే పరిస్థితుల్లో ఆమెకు మహా అయితే కోటి రూపాయల రెమ్యునరేషన్ మాత్రమే వస్తుంది.  కానీ కాజల్ మాత్రం ఏకంగా రెండు కోట్లు పుచ్చుకుందట. కెరీర్ డౌన్లో ఉన్నప్పుడు అవకాశాలు రావడమే కష్టం.  అలాంటిది కాజల్ కళ్ళు చెదిరే పారితోషకం అందుకుంది అంటే విశేషమే అనాలి. అన్నట్టు ఇదే కాజల్ అగర్వాల్ కెరీర్ మొత్తంలో హయ్యస్ట్ పే చెక్.