మన భారతదేశంలో వనమూలికలు,సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మనం ప్రతిరోజు తయారు చేసుకునే ఆహార పదార్థాలలో అల్లం వెల్లుల్లి వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వంటింట్లో ఉండే మసాలా పదార్థాలలో వెల్లుల్లి తప్పనిసరిగా ఉంటుంది. వెల్లుల్లిని ఎన్నో వంటలలో విరివిగా ఉపయోగిస్తారు. ఆహార పదార్థాలలో వెల్లుల్లిని వేయడం వల్ల అద్భుతమైన సువాసన మాత్రమే కాకుండా రుచి కూడా ఉంటాయి. ఇటువంటి వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు గల ఔషధ గుణాలు కూడా ఉంటాయి. కొన్ని ఆరోగ్య సమస్యల నివారణకి ఆయుర్వేదంలో కూడా వెల్లుల్లిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన వెల్లుల్లి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వెల్లుల్లిని వివిధ రకాల వంటలలో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ప్రతిరోజు పరగడుపున పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లిలో ఉండే ఆంటీ యాక్సిడెంట్లు శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడంలో ఉపయోగపడతాయి. ప్రతిరోజు ఉదయం 3 పచ్చి వెల్లుల్లి రెబ్బలలో తినటం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడి అజీర్తి, ఉబ్బసం వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. అంతేకాకుండా పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల ఈ వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు రాకుండా అరికట్టవచ్చు. వీటిని తినడం వల్ల నోటి సమస్యలు కూడా దూరమవుతాయి.
పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినలేని వారు ఒక గ్లాసు పాలలో 4 వెల్లుల్లి రెబ్బలు వేసి పాలను బాగా మరిగించి వాటిని చల్లార్చిన తర్వాత తాగాలి. ఇలా చేయటం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగించి రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. కాకుండా రక్తపోటు, గుండే సంబంధిత వ్యాధులు కూడా దరిచేరకుండా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఒక గ్లాస్ నీటిలో పది చుక్కల వెల్లుల్లి రసం కలుపుకొని తాగటం వల్ల వారి సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా పురుషులు పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల వారిలో లైంగిక సామర్థ్యం పెరగడమే కాకుండా నరాల బలహీనత, శీఘ్రస్కలనం వంటి సమస్యలు దూరం అవుతాయి. ఆరోగ్యానికి మంచిది కదా అధిక మోతాదులో వెల్లుల్లి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఏ ఆహార పదార్థాలు అయినా సరైన మోతాదులో తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది.