ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్స్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఈ మధ్య కాలంలో హైకోర్టు నుండి వరస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తున్న క్రమంలో కొందరి అధికారుల మీద అలాగే ప్రభుత్వంలోని కొందరి మీద నిమ్మగడ్డ తీసుకుంటున్న చర్యలను హైకోర్టు తప్పు పడుతుంది.
నెల నెల ఇంటింటికి రేషన్ పంపిణీని తనకున్న విచక్షణ అధికారాలను ఉపయోగించి నిమ్మగడ్డ అడ్డుకున్నాడు. దానిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ను ఆశ్రహించింది. అయితే రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నా నేపథ్యంలో డోర్ డెలివరీ రేషన్ పై స్ఈసీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచిస్తూ ఐదురోజుల గడువు ఇచ్చింది. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో మాత్రం డోర్ డెలవరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
దీనితో డోర్ డెలివరీ వాహనాలను తన కార్యాలయానికి పిలిపించుకొని వాటిని పరిశీలించి ఆ వాహనాల మీద పార్టీ రంగులను పోలిన రంగులు అదే విధంగా సీఎం జగన్ అయన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలు ఫొటోలున్నాయని, వాటిని తొలగించాలని ఎస్ఈసీ ఆదేశించారు. అంత వరకూ డోర్ డెలవరీకి అనుమతి లేదని తేల్చి చెప్పారు.ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిర్ణయంపై ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై హైకోర్టు విచారించి కీలక తీర్పు వెలువరించింది.
వాహనాలపై రంగులను మార్చాలన్న ఎస్ఈసీ వాదనను సస్పెండ్ చేసింది హైకోర్టు. మార్చి 15 వరకు సస్పెన్షన్ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. తిరిగి ఈ అంశంపై మార్చి 15న తదుపరి విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది. ఇప్పటికిప్పుడు వాహనాల మీదా రంగుల మార్చాటం అంటే ఖర్చుతో కూడుకున్న పని అని ప్రభుత్వం చేసిన వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
వచ్చే నెల 15వ తేదీ నాటికి ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.కోర్టు అప్పటివరకు స్టే ఇచ్చింది కాబట్టి ఇంటింటికి రేషన్ పంపిణి పక్రియ చేసుకోవటానికి మార్గం సులభం అయినట్లే లెక్క, గతంలో వైసీపీ మంత్రుల విషయంలో నిమ్మగడ్డకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చింది ఇప్పుడు కూడా మరోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వ్యతిరేకంగా తీర్పు రావటం జరిగింది