Journey Tips: చాలామంది ప్రయాణాలు చేయటం అంటే ఇష్టంగా ఉంటుంది, కానీ ప్రయాణం చేసే సమయంలో వాంతులు-విరేచనాలు అవుతాయని భయంతో చాలామంది తమ ప్రయాణాలు మానుకుంటారు. ఇటువంటి వారు మనకి సులభంగా లభ్యమయ్యే పదార్థాలతో కొన్ని చిట్కాలను పాటించడంవల్ల వారి ప్రయాణాలను కొనసాగించవచ్చు. ఇప్పుడు మనం ఈ చిట్కాల గురించి తెలుసుకుందాం.
*ప్రయాణం చేసే సమయంలో వాంతులు అవుతుంటే నిమ్మ పండు వాసన చూడటం లేదా నిమ్మ పండు రసాన్ని ఒక గ్లాసు నీటిలో కొంచెం ఉప్పు వేసి కలిపి తాగితే వాంతుల నుండి విముక్తి పొందవచ్చు.
*పుదీనా ఆకుల లో వాంతులు రాకుండా చేసే గుణం ఉంటుంది. అందువల్ల ప్రయాణాలు చేసేటప్పుడు పుదీనా ఆకులను మీతోపాటు తీసుకెళ్లి వాటిని వాసన చూడటం ఆకులను నమలటం మంచిది. పుదీనా టీ తాగడం వల్ల విరేచనాలు వంటి సమస్యలు కూడా ఉండవు.
*అల్లంలో వాంతులను నియంత్రించే గుణం ఉంటుంది. అందువల్ల ప్రయాణం చేసే ముందు అల్లం టీ తాగటం మంచిది. అలాగే ప్రయాణానికి ముందు అతిగా తినకపోవటం శ్రేయస్కరం.
*యాలకులను వాసన చూడటం లేదా నమలటం వల్ల ప్రయాణం చేసే సమయంలో వాంతులు రాకుండా ఉంటాయి.
*యాలకులు రుచికి కారంగా ఉన్నప్పటికీ అవి వాంతులు రాకుండా చేస్తాయి. ప్రయాణం చేసేటప్పుడు ఒక లవంగాన్ని నోట్లో వేసుకోవడం వల్ల వాంతులు అవ్వవు.