తప్పుడు ప్రచారాలు గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన జీవిత.. తప్పు చేస్తే రోడ్డుపై నిలబెట్టి కొట్టండి!

నటి జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన చిత్రం శేఖర్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మే 20వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా జీవిత ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ముఖ్యంగా తన కుటుంబం గురించి తన పిల్లల గురించి వస్తున్న తప్పుడు వార్తలు గురించి ఈమె స్పందించారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా జీవిత ఒక వర్గం వారిని ఉద్దేశిస్తూ మాట్లాడారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

తాను మాట్లాడిన మాటలకు మరోలా అర్థాలు తీస్తూ ఈ వార్తలను సృష్టిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తన మాటల ద్వారా ఎవరినైనా బాధపెట్టి ఉంటే తాను బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని తెలియజేశారు. అదేవిధంగా తన కుటుంబం గురించి లేనిపోని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఈమె మాట్లాడుతూ నా గురించి నా కుటుంబం గురించి వచ్చే వార్తలు బహుశా ఎవరిపై రావేమో. గత కొన్ని రోజుల క్రితం నా కూతురు బాయ్ ఫ్రెండ్ తో దుబాయ్ వెళ్ళింది అంటూ ప్రచారం చేశారు.

ఒకసారి శివాని అంటారు మరోసారి శివాత్మిక అంటారు. తీరా ఆ శీర్షిక చూసే చదివితే అందులో తన కూతుర్లకు సంబంధించిన వార్త ఏమాత్రం లేదు. కుటుంబం మొత్తం దుబాయ్ కలిసి వెళ్తే ఏకంగా ప్రియుడితో లేచిపోయింది అంటూ ఎంతో అభ్యంతరకరమైన రాతలు రాశారని ఈమె వెల్లడించారు.ఇకపోతే గరుడవేగ సినిమా విషయంలో ఎన్నో వార్తలు రాశారు .కోర్టు తీర్పు వెల్లడించక ముందే ఇలాంటి వార్తలు రాస్తూ ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు.ఒకవేళ మేము తప్పు చేశామని రుజువైతే రోడ్డుపై నిలబెట్టి కొట్టండి కానీ ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి అంటూ ఈమె ఘాటుగా స్పందించారు.