జేసీ దివాకర్ రెడ్డి అంటే తెలియని వారుండరు. ఆయన నొరెత్తి మాట్లాడినా కొట్టినట్టే ఉంటుందని అంటుంటారు. పైగా ఎవ్వరికీ భయపడని నైజం ఆయనది. తాము ఉన్న పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా, తాము పదవుల్లో ఉన్నా లేకున్నా జేసీ దివాకర్ రెడ్డి తీరు ఒకేలా ఉంటుంది. అవతల ఎవరైనా డోంట్ కేర్ అంటుంటారు. అందుకే అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పారు. కాంగ్రెస్ హయాంలో సీమ పాలిటిక్స్ లో ఒక వెలుగు వెలిగారు. కానీ ఇప్పుడు.. వెలగడం కాదు కదా కనీసం బయట కనిపించడంలేదు. రాజకీయాలకు దూరంగా ఫామ్ హౌజ్లోనే గడుపుతున్నారు. ఈ పరిస్థితికి కారణం ఎవరయా అంటే వైఎస్ జగన్ అనే సమాధానమే వినబడుతోంది.
టీడీపీ నేతల అరెస్టుల పర్వం మొదలైనప్పుడు ఆరెస్ట కాబడిన నేతల్లో జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడ ఉన్నారు. 154 బస్సులకు సంబంధించి నకిలీ ఎన్వోసీలు సృష్టించారని, వాహనాలను బీఎస్ 3 నుండి బీఎస్ 4కు మార్చడం, ఇన్స్యూరెన్సులు చెల్లించకుండానే చెల్లించినట్టు నకిలీ పత్రాలు సృష్టించడం వంటి ఆరోపణలతో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిల మీద కేసు నమోదుచేసి జైలుకు పంపారు. జైలుకెళ్లిన మొదట్లో త్వరగానే బయటికి రావొచ్చని జేసీ అనుకున్నారు. కానీ అంత సామాన్యంగా వారికి బెయిల్ దొరకలేదు. ఎలాగో బెయిల్ తెచ్చుకుని బయటికొచ్చిన కాసేపటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో జైలుకు వెళ్లారు. ఆ తర్వాత వారి ఆర్థిక మూలాలు కదలడం మొదలైంది.
ఈ వరుస దెబ్బలతో జేసీ సోదరులు చాలా ఇబ్బందిపడ్డారు. దశాబ్దాల రాజకీయ జీవితంలో జేసీ ఫ్యామిలీ ఇలాంటి గడ్డు పరిస్థితులను ఏనాడూ చూసి ఉండదు. జేసీ సోదరుల గురించి తెలిసిన ప్రతిఒక్కరూ యిదే మాట అంటున్నారు. ఈ సంఘటనల తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయాలకు దూరం పాటించడం స్టార్ట్ చేశారు. మామూలుగా అయితే ఎప్పుడూ ఏదో ఒక విషయం మీద వివాదాల్లో ఉంటూ వచ్చే ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఎక్కువగా ఫామ్ హౌజ్లోంనే ఉంటూ, అన్నీ అక్కడి నుండే చక్కబెట్టుకుంటూ కొంచెం ప్రశాంతతను ఆస్వాదిస్తున్నారట. ఎంతో మందికి నిద్ర లేకుండా చేసిన జేసీ ఇప్పుడిలా ప్రశాంతత కోసం వెతుక్కోవడం చూస్తే జగన్ చేసిన భీభత్సం ఎంత ప్రభావం చూపిందో కదా అనిపించక మానదు.