జగన్ రోజువారీ ఆదాయంపై జేసీ సంచలన వ్యాఖ్యలు.. 300 కోట్లు నిజమేనా..?

jc diwakar reddy

 ఈ మధ్య పెద్దగా మీడియా ముందుకు రావటానికి ఇష్టపడని జేసీ దివాకర్ రెడ్డి, అప్పుడప్పుడు మీడియా కంట్లో పడిన కానీ, కావాల్సిన మసాలా ఇస్తూ ఉంటాడు. ఆయన మైక్ అందుకుంటే ఎదో ఒక కాంట్రవర్సీ టాపిక్ ను లేవనెత్తటం ఆయన నైజం. తాజాగా పంచాయితీ ఎన్నికలు ముగిసిన అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సీఎం జగన్ యొక్క రోజువారీ ఆదాయంపై కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

jc diwakar reddy

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజు సంపాదన రూ. మూడు వందల కోట్లు అని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి లెక్క చెప్పారు. సీఎం జగన్ కు ఉన్న వ్యాపారాలు, సిమెంట్ ఫ్యాక్టరీ, సాక్షి, ఇతర కంపెనీల ద్వారా వచ్చే ఆదాయాన్ని జేసీ దివాకర్ రెడ్డి చెప్పలేదు. జే ట్యాక్స్ ద్వారా వసూలు చేస్తున్న మొత్తంలో రోజుకు సీఎం జగన్ కు రూ. మూడు వందల కోట్లు ముడుతున్నాయని ఆయన విశ్లేషిస్తున్నారు.

 అయితే ఈ మాటలు తనవి కాదని, ప్రజల్లో వినిపిస్తున్న మాటలను ఇక్కడ చెప్పానంటూ పిల్లిమొగ్గలు వేశాడు. నిజానికి జేసీ ఏమి మాట్లాడిన డైరెక్ట్ గా మాట్లాడుతాడు తప్పితే, ఎవరో అంటున్నారు అని మాత్రం మాట్లాడే రకం కాదు.. కానీ సీఎం జగన్ రోజు వారి ఆదాయం విషయంలో పబ్లిక్ టాక్ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు , బహుశా తన మీద ప్రభుత్వం ఏమైనా కేసులు పెడుతుంది అనే భయం గుర్తుకు వచ్చింది ఏమో..

 ఇదే సమయంలో పంచాయతీ ఎన్నికల్లో డబ్బే ప్రధాన పాత్ర పోషించిందని, వైసీపీ డబ్బు ప్రభావంతోనే ఎన్నికల్లో గెలుపొందుతున్నారని .. కుప్పంను చంద్రబాబు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినా.. వైసీపీతో పోటీ పడి డబ్బులు ఇవ్వలేక ఓడిపోయారని చెప్పుకొచ్చారు. అధికార పార్టీ డబ్బుకు తోడు పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారని.. అభివృద్ధి చూసి వైసీపీకి ఓటేశారనడం దొంగ మాటగా తేల్చేశారు.

 చంద్రబాబు, జగన్ ఎలాంటి వారో ప్రజలందరికీ తెలుసని ఆయన గుర్తు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, నోటు లేనిదే ఓటు వేసే వారు తగ్గిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక్క ఏపీ పరిస్థితి కాదని, దేశంలో ఎక్కడకు వెళ్లినా ఓటుకు విలువ కడుతున్నారని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు.అయితే జేసీ దివాకర్ రెడ్డి నిజంగానే జనంలో ఉన్న మాటల్నే అన్నారో లేకపోతే… తనకు తెలిసిన సమాచారాన్ని ప్రజల్లో చర్చకు పెట్టాలనుకున్నారో కానీ.. రూ. మూడు వందల కోట్లు అంటూ.. ఓ లెక్కను ప్రజల్లోకి వదిలారు.